Vishwambhara: రిలీజ్ డేట్ లాక్.. థియేటర్లలో విజువల్ వండర్ వచ్చేదప్పుడే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ గురించిన చర్చలే జరుగుతున్నాయి, ఎట్టకేలకు ఈ సోషియో ఫాంటసీ విజువల్ వండర్ ప్రేక్షకులను పలకరించేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. వశిష్ట దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రాన్ని జులై 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. వాస్తవానికి ఈ చిత్రం సంక్రాంతికే రావాల్సి ఉన్నప్పటికీ, గ్రాఫిక్స్ పనుల్లో నాణ్యత కోసం మేకర్స్ వెనక్కి తగ్గారు, ఇప్పుడు పనులన్నీ ఒక కొలిక్కి రావడంతో జులై నెలను లాక్ చేసినట్లు తెలుస్తోంది.
Also Read : Adivi Sesh: వాళ్ళకి ఈలలు, కేకలు వేసి నా సినిమాకి టికెట్లు కొన్నారు.. హీరోలపై శేష్ సెన్సేషనల్ కామెంట్స్
Also Read
చిరంజీవి కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో, హాలీవుడ్ రేంజ్ విజువల్స్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమాకు VFX ప్రధాన ఆకర్షణ. ప్రతి ఫ్రేమ్‌ను అద్భుతంగా తీర్చిదిద్దేందుకు సాంకేతిక నిపుణులు సుదీర్ఘ కాలంగా శ్రమిస్తున్నారు, ఈ సుదీర్ఘ విరామానికి తెరదించుతూ, వేసవి తర్వాత మెగా ఫ్యాన్స్‌కు అసలైన విందును అందించబోతున్నారు. రిలీజ్ డేట్‌పై ఇప్పటికే మెగా కాంపౌండ్ నుంచి సంకేతాలు అందుతున్నప్పటికీ, మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావడమే మిగిలి ఉంది. ఒక భారీ పోస్టర్ లేదా టీజర్ ద్వారా ఈ డేట్‌ను అనౌన్స్ చేసే అవకాశం ఉందని సమాచారం. ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’, అంజి వంటి సినిమాల తర్వాత చిరంజీవి మళ్లీ అదే స్థాయిలో ఒక సోషియో ఫాంటసీ కథతో వస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
తాజావార్తలు
-
Ranabaali Trailer: ‘రణబాలి’ ట్రైలర్‌పై మంత్రి లోకేష్ రివ్యూ!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
-
Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!