Site icon NTV Telugu

Chiranjeevi : నువ్వు ఉన్నత శిఖరాలకు ఎదగాలి.. శేఖర్ కమ్ములపై చిరు పోస్ట్

Chiranjeevi

Chiranjeevi

Chiranjeevi : డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఇండస్ట్రీకి వచ్చి 25 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా మెగాస్టార్ చిరంజీవిని కలిసి ఆటోగ్రాఫ్‌ తీసుకున్నాడు. ఆ పోస్టును రీసెంట్ గానే పోస్టు చేశాడు. అయితే తాజాగా చిరంజీవి కూడా శేఖర్ కమ్ములను ప్రశంసిస్తూ ట్వీట్ చేశాడు. ఇందులో శేఖర్ కమ్ములతో దిగిన ఫొటోలను కూడా పంచుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. శేఖర్ కమ్ములకు ఓ స్పెషల్ నోట్ కూడా రాసి ఇచ్చాడు. ఇందులో ఆల్ ది బెస్ట్ మై బాయ్ అని రాసి ఉంది. కింద చిరు సైన్ చేశారు. శేఖర్ కమ్ములను ప్రశంసిస్తూ ఓ సుదీర్ఘమైన ట్వీట్ చేశాడు మెగాస్టార్.

Read Also : Kalpika Ganesh : డిస్కౌంట్ అడగలేదు.. డిసర్ట్ అడిగితే గొడవ పడ్డారు.. కల్పిక క్లారిటీ..

‘మీ 25ఏళ్ల కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సున్నితమైన సినిమాలు తీస్తూనే అందులో ఒక సోషల్ మెసేజ్ ను కూడా ఇస్తున్నారు. అందుకే ఈ సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం. మీ అద్భుతమైన ప్రయాణానికి నేను స్ఫూర్తి అని తెలిసి చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. ఒక గొప్ప జర్నీకి నేను కారణం అయినందుకు చాలా గర్వంగా కూడా ఉంది. మీరు మరో 25 ఏళ్లు ఇలాగే సున్నితమైన సినిమాలతో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ మై బాయ్’ అంటూ రాసుకొచ్చారు చిరంజీవి.

శేఖర్ కమ్ముల తీసే సినిమాలకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆయన ప్రతి సినిమాలో ఎమోషన్స్ ప్రాధాన్యంగా తీస్తూనే ఓ మెసేజ్ కూడా ఇస్తుంటారు. కంటెంట్ పరంగా చాలా డిఫరెంట్ గా ఉంటాయి శేఖర్ సినిమాలు. హీరోలను మాస్ యాంగిల్ లో కాకుండా.. సున్నితత్వమైన భావం ఉండేలా చూపించడం ఆయన స్పెషాలిటీ.

Read Also : Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్ కు మరో శుభవార్త.. హరీష్ శంకర్ కీలక ప్రకటన

Exit mobile version