Site icon NTV Telugu

రేపు మెగాస్టార్ రాజమండ్రి పర్యటన

Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి రేపు రాజమండ్రి పర్యటనకు వెళ్లనున్నారు. తూర్పు గోదావరి జిల్లా లోని రాజమండ్రికి పయనం కానున్నారు. రాజమండ్రి లోని ఓ వైద్య కళాశాలలోని అల్లు రామ లింగయ్య విగ్రహాన్ని ఓపెన్ చేయడానికి ఆయన అక్కడికి వెళ్తున్నారు. డాక్టర్‌ అల్లు రామలింగయ్య హోమియోపతి వైద్య కళాశాల, ఆసుపత్రి ఆవరణలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ సహకారంతో ఏర్పాటు చేసిన అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని చిరంజీవి ఆవిష్కరించనున్నారు. అయితే ఆంధ్రాలో పవన్, వైసీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో చిరు పర్యటన ఆసక్తికరంగా మారింది.

Read Also : ‘పుష్ప’ సెకండ్ సింగిల్ కు హీరోయిన్ పేరు !

మరోవైపు సినిమా ఇండస్ట్రీ సమస్యల విషయంలోనూ పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న ఏపీ ప్రభుత్వాన్ని కలిసిన తెలుగు సినిమా నిర్మాతలు ప్రభుత్వం సానుకూలంగానే స్పందించింది అని, ఆన్లైన్ టికెట్ కోరింది తామేనని వెల్లడించారు. పవన్ వ్యాఖ్యలకు సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రముఖులెవరూ సపోర్ట్ చేయకపోవడం గమనార్హం.

Exit mobile version