Site icon NTV Telugu

అప్డేట్: సాయిధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ ట్రైలర్ విడుదల చేయనున్న చిరు

మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘రిపబ్లిక్’.. దేవకట్టా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా అక్టోబర్ 1న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ క్రమంలో ట్రైలర్ అప్డేట్ ఇచ్చింది చిత్రబృందం.. ఈ సినిమా ట్రైలర్ ను రేపు ఉదయం 10 గంటలకు మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేయబోతున్నారు. సీరియస్ పొలిటికల్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాని జేబీ ఎంటరటైన్మెంట్స్ బ్యానర్ పై భగవాన్, పుల్లారావు సంయుక్తంగా నిర్మించారు.

సాయి ధరమ్ తేజ్ సరసన ఐశ్వర్య రాజేష్ కథానాయికగా నటించింది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, పాటలకు మంచి స్పందన రావడంతో ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

ఇటీవలే సాయితేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.. ప్రస్తుతం జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సాయి తేజ్‌ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా మెరుగుపడింది. సొంతంగానే శ్వాస తీసుకుంటున్న సాయిధరమ్‌.. అందరితో మాట్లాడగలుగుతున్నారు. మరో రెండు, మూడురోజుల్లో ఆయన్ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేయనున్నట్లు తెలుస్తోంది.

Exit mobile version