Chiranjeevi Talks About Heroes Remuneration Issue: ఆమధ్య ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ రేట్లపై రగడ జరిగినప్పుడు.. హీరోల రెమ్యునరేషన్‌పై కూడా నానా రాద్ధాంతం జరిగిన వ్యవహారం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎందుకు హీరోలు కోటానుకోట్ల పారితోషికం తీసుకుంటున్నారని, సినిమా బడ్జెట్‌లో పెట్టే మొత్తంలో సగం డబ్బులు వారికే ఇవ్వాల్సి వస్తోందంటూ అప్పట్లో తెగ చర్చలు జరిగాయి. హీరోలు తమ రెమ్యునరేషన్ తగ్గించుకుంటే.. సినిమాల బడ్జెట్ కూడా తగ్గుతుందని, ఫలితంగా టికెట్ రేట్లను సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా కేటాయించవచ్చని కొందరు మేధావులు విశ్లేషించారు. ఇప్పటికీ ఈ పారితోషికం విషయం అనేది హాట్ టాపిక్‌గానే ఉంది. హీరోలు తమ రెమ్యునరేషన్ తగ్గించుకోవాల్సిందేనని డిమాండ్స్ వస్తూనే ఉన్నాయి.
Delhi Court: విమానంలో మహిళపై మూత్ర విసర్జన.. నిందితుడికి బెయిల్ నిరాకరణ
ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవికి ఈ రెమ్యునరేషన్ విషయంపై ఓ ప్రశ్న ఎదురైనప్పుడు.. అసలు హీరోలు ఎందుకు తమ పారితోషికం తగ్గించుకోవాలని ఆయనే సూటిగా ప్రశ్నించారు. తన వాల్తేరు వీరయ్య ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా తాజాగా ఎన్టీవీకి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో.. సినిమాల బడ్జెట్ గురించి చిరు ప్రస్తావించారు. ఈ సమయంలోనే యాంకర్ జోక్యం చేసుకొని.. ‘‘బడ్జెట్‌లో సగం మొత్తం హీరోల రెమ్యునరేషన్‌కే పోతోందని, వాళ్లు ఎందుకు తమ పారితోషికం తగ్గించుకోకూడదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయని, మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటని’’ ప్రశ్నించారు. అప్పుడు చిరు వెంటనే అందుకొని.. ‘‘ఎందుకు తగ్గించుకోకూడదు’’ అంటూ వెంటనే నిలదీశారు. తనకంటూ ఒక పెద్ద మార్కెట్ ఉన్న హీరో వల్లే ఒక సినిమాకి భారీ బిజినెస్ జరిగినప్పుడు.. తన లైన్ షేర్‌ని హీరో తీసుకోవడంలో తప్పేంటని అన్నారు.
Nara Lokesh: ‘వీర సింహారెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’పై లోకేష్ ట్వీట్.. చిచ్చు పెట్టే కుట్ర..!
అయితే.. అందరికీ విన్-విన్ సిట్యుయేషన్ అనేది రావాలనే విజ్ఞతని కూడా కలిగి ఉండాలని చిరు సూచించారు. మొత్తమంతా తనకే దక్కాలని హీరోలు గానీ, దర్శకులు గానీ ఆలోచించకుండా.. అందరికీ తగిన న్యాయం జరగాలన్నారు. ‘నేను’ అనే ధోరణి ఉండకుండా.. నాతోపాటు నిర్మాత, నాతోపాటు టెక్నీషియన్స్, డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు కూడా లాభపొందాలన్న ఆలోచన కలిగి ఉండాలన్నారు. ఏదేమైనా.. హీరోలుగా తామూ కష్టపడుతున్నామని, తమకున్న ఇమేజ్ & మార్కెట్ దృష్ట్యా హీరోలు భారీ పారితోషికాలు అందుకోవడంలో తప్పేం లేదని చిరు ఉద్ఘాటించారు.
Waltair Veerayya: ‘బాస్ పార్టీ’ గొడవపై చిరు క్లారిటీ.. అదే కోపం తెప్పించింది