JVAS : చాలా ఏళ్ల తర్వాత జగదేక వీరుడు, అతిలోక సుందరి గురించి చర్చ జరుగుతోంది. ఈ మూవీని మే 9న రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మూవీకి సంబంధించిన అనేక విషయాలు వైరల్ అవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి, అందాల తార శ్రీదేవి జంటగా నటించగా.. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దీన్ని డైరెక్ట్ చేశారు. ఈ మూవీ అప్పట్లో ఓ సెన్సేషన్. సోషియో ఫాంటసీగా వచ్చిన ఈ మూవీ.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. నిర్మాత అశ్వినీదత్ కు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. 1990 మే 9న ఈ మూవీ రిలీజ్ అయింది. 35 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఇప్పుడు రీ రిలీజ్ చేస్తున్నారు.
Read Also : Trivikram Srinivas : సిరివెన్నెల రాసిన ఆ పాటనే అన్నింటికంటే గొప్పది : త్రివిక్రమ్
అయితే ఈ మూవీలో చిరంజీవి, శ్రీదేవి రెమ్యునరేషన్ ఎంత అని చాలా మంది వెతుకుతున్నారు. ఈ మూవీ కోసం చిరంజీవికి రూ.25 లక్షలు, శ్రీదేవికి రూ.20 లక్షలు ఇచ్చినట్టు సినీ వర్గాలు తెలిపాయి. రూ.2 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ మూవీ రూ.15 కోట్లు రాబట్టి సంచలనం సృష్టించింది. ఈ మూవీలోని పాటలు ఉర్రూతలూగించాయి. చిరంజీవి, శ్రీదేవి డ్యాన్స్ అందరినీ మైమరిపించేసింది. వీరిద్దరి గ్రేస్ అప్పట్లో ఓ ట్రెండ్ సెట్ చేసింది. ఇప్పుడు రీ రిలీజ్ కు రెడీ అవుతోంది.
Read Also : Mangalavaram 2: ఈసారి మరింత భయపెట్టేలా మంగళవారం 2
