NTV Telugu Site icon

Chiranjeevi: వాల్తేరు వీరయ్య టీమ్ కు చిరు షాక్.. లిటిల్ సర్ప్రైజ్ అని సాంగ్ లీక్

Chiru

Chiru

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇటీవలే గాడ్ ఫాదర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరు ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్య గా రాబోతున్నాడు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరు సరసన శృతి హాసన్ నటిస్తుండగా.. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన బాస్ పార్టీ సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంది. ఇక ఇటీవలే ఒక సాంగ్ షూటింగ్ కోసం చిత్ర బృందం మొత్తం యూరప్ కు పయనమైన విషయం విదితమే. ఇక చిరు సంగతి తెల్సిందేగా.. ఆయన తన సినిమాలే కాదు మిగతావారి సినిమాల అప్డేట్స్ ను కూడా లీక్ చేస్తూ ఉంటారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ లొకేషన్స్ చూపిస్తూ మరో సాంగ్ గురించి లీక్ చేసి చిత్ర బృందానికి షాక్ ఇచ్చాడు.

యూరప్ లో సాంగ్ షూటింగ్ చేస్తున్నప్పుడు అందమైన దృశ్యాలను, ఆ మంచు ప్రాంతాలు చాలా బావున్నాయని, వాటిని అభిమానులతో పంచుకోవడం కోసం తానే స్వయంగా వీడియోలు తీసి పోస్ట్ చేస్తున్నానని, అభిమానులకు లిటిల్ సర్ప్రైజ్ అని చెప్పుకొచ్చాడు. ఇక చివర్లో ఇక్కడ షూట్ చేసిన సాంగ్ ను లీక్ చేస్తున్నా అని చెప్పుకొచ్చాడు. “నువ్వే కనుక శ్రీదేవి అయితే నేనే చిరంజీవి” అంటూ ఈ సాంగ్ సాగుతుందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ఈ సాంగ్ ను కూడా దేవి శ్రీ ప్రసాదే ఆలపించినట్లు తెలుస్తోంది. మరి ఈసారి ఎన్ని ట్రోల్స్ రానున్నాయో చూడాలి.