Chiranjeevi Sensational Comments On Pawan Kalyan Politics: తన వాల్తేరు వీరయ్య సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ రాజకీయాలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రాబోయే ఎన్నికల్లో రాజకీయంగా పవన్‌కి తన మద్దతు ఉండదని పరోక్షంగా క్లారిటీ ఇచ్చేశారు. తాము కలిసినప్పుడు సైతం తమ మధ్య పాలిటిక్స్‌కి సంబంధించిన చర్చలేమీ జరగవని స్పష్టం చేశారు. ఏపీలో రాజకీయాలకు, సినిమాలకు మధ్య ఎలాంటి క్లాష్ లేదని తెలిపారు. పవన్ పాలిటిక్స్ కూడా తమపై ఎలాంటి ప్రభావం లేదని, ఒకవేళ ఉంటే ‘వాల్తేరు వీరయ్య’ సినిమాకు ఇబ్బందులు తలెత్తేవి కదా? అని సమాధానం ఇచ్చారు. టికెట్ రేట్లు పెంచుకోవడానికి, అదనపు షోస్ వేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని.. ఇందుకు తాను ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు.
Passports: అత్యంత బలహీనమైన పాస్‌పోర్టు పాకిస్థాన్‌దే.. మరి భారత్ సంగతేంటి?
2024 ఎన్నికల్లో తాను ఎలాంటి పొలిటికల్ స్టాండ్ తీసుకోనని, ఇందులో 100% సందేహమే లేదని చిరంజీవి బల్లగుద్దిమరీ చెప్పారు. పరిస్థితులకు అనుగుణంగా వ్యక్తులు మారుతుంటారని, అలా మారడం కూడా మంచి పరిణామమేనని చిరు చెప్పారు. ప్రస్తుతం తానిప్పుడు సౌమ్యంగా ఉన్నంతమాత్రాన గతంలోనూ ఇలాగే ఉన్నానని అర్థం కాదని, కాలానికి అనుగుణంగా మారడం తనకు కంఫర్టబుల్‌గా ఉంటుందన్నారు. పవన్, నాగబాబు ఇప్పుడు ఫీరోషియస్‌గా ఉండటం అనేది వాళ్లకు అడ్వాంటేజ్ అని చెప్పుకొచ్చారు. నిజానికి.. గతంలో చిరంజీవి కొన్ని సందర్భాల్లో రాజకీయంగా పవన్‌కి మద్దతు తెలిపేందుకు తానెప్పుడూ సిద్ధంగానే ఉంటానని చిరు మాటిచ్చారు. కానీ, ఇప్పుడు ఆయన పవన్ పాలిటిక్స్‌తో తనకు సంబంధమే లేదన్నట్టుగా మాట్లాడుతుండటం గమనార్హం. బహుశా తనపై ‘రాజకీయ’ ముద్ర పూర్తిగా చెరిపోసుకోవడం కోసమే చిరు ఇలా బ్యాక్‌స్టెప్ తీసుకొని ఉంటారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Chiranjeevi: హీరోలు ఎందుకు రెమ్యునరేషన్ తగ్గించుకోవాలి.. చిరు సూటి ప్రశ్న