Chiranjeevi- Ram Charan : చిరంజీవికి సంక్రాంతి సీజన్ కలిసొస్తుంది. ఆయన నటించిన వాల్తేరు వీరయ్య 2023లో పోటీ మధ్య వచ్చి పెద్ద హిట్ అయింది. అందుకే ఇప్పుడు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చేస్తున్న మన శంకర వర ప్రసాద్ గారు మూవీని కూడా 2026 సంక్రాంతికి తీసుకొస్తున్నారు. ఇదే సంక్రాంతి సీజన్ రామ్ చరణ్ కు పెద్దగా కలిసి రాలేదు. శంకర్ డైరెక్షన్ లో వచ్చిన గేమ్ ఛేంజర్ సినిమా ఎన్నో అంచనాల మధ్య వచ్చి ప్లాప్ అయింది. వాస్తవానికి బుచ్చిబాబుతో చేస్తున్న పెద్ది మూవీని కూడా 2026 సంక్రాంతికే తీసుకురావాలని అనుకున్నారు.
Read Also : Akhanda 2 : ఇది బాలయ్య తాండవం.. ఆ పర్ఫార్మెన్స్ చూశారా..
కానీ సంక్రాంతి అచ్చి రావట్లేదనే ఉద్దేశంతోనే సమ్మర్ కు ప్లాన్ చేసి ఆ మేరకు మూవీ షూటింగ్ చేశారంట. చిరంజీవికి సంక్రాంతి బాగా కలిసొచ్చింది కాబట్టే.. రాబోయే సంక్రాంతికి అంత పెద్ద పోటీ ఉన్నా సరే తన మూవీని తీసుకొస్తున్నారు మెగాస్టార్. అటు రామ్ చరణ్ తనకు కలిసొచ్చిన సమ్మర్ సీజన్ నే నమ్ముకుంటున్నారు. గతంలో సమ్మర్ కు వచ్చిన చరణ్ మూవీలు బాగానే ఆడాయి. పైగా స్టూడెంట్స్ కు సెలవులు కాబట్టి ఏ మాత్రం హిట్ టాక్ వచ్చినా కలెక్షన్ల ఊచకోత ఖాయం. అందుకే వీరిద్దరూ ఇలా రూట్ ఛేంజ్ చేసుకుని సినిమాలను ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.
Read Also : SSMB 29 : మళ్లీ కాపీ కొట్టిన జక్కన్న..? పృథ్వీరాజ్ లుక్ అక్కడి నుంచి వచ్చిందా..!
