మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుమారుడు రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం ‘ఆచార్య’. ఈ మూవీ ఏప్రిల్ 29న థియేటర్లలోకి వచ్చింది. సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ఇక ‘ఆచార్య’ సంగతి పక్కన పెడితే మెగా లీకుల హంగామా నడుస్తోంది. ఇటీవల జరిగిన ‘ఆచార్య’ ప్రమోషన్లలో హరీష్ శంకర్ చేత “భవదీయుడు భగత్ సింగ్”లోని పవర్ ఫుల్ డైలాగును చెప్పించిన చిరు, ఇదే ప్రమోషన్ కార్యక్రమంలో తన నెక్స్ట్ మూవీ టైటిల్ ను కూడా లీక్ చేశారు. ఇటీవల ‘ఆచార్య’ కోసం యంగ్ డైరెక్టర్స్ అందరినీ కలిసిన చిరంజీవి, ఆ మీట్ తాను బాబీతో చేయబోయే సినిమాకు సంబంధించిన టైటిల్ ను రివీల్ చేశారు.
Read Also : Mahesh Babu : ప్యారిస్ ట్రిప్… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఆల్బమ్
మెగాస్టార్ చిరంజీవి ఖాతాలో వరుస సినిమాలు ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆచార్య తెరపైకి రాగా, భోళా శంకర్, గాడ్ ఫాదర్, బాబీ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు. అయితే బాబీ డైరెక్షన్ లో చిరు హీరోగా నటిస్తున్న మూవీని “మెగా 154” అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం “వాల్తేరు వీరయ్య” అనే టైటిల్ ను అనుకుంటున్నట్టుగా కొన్నాళ్ల క్రితం రూమర్లు విన్పించాయి. ఆ రూమర్లను నిజం చేస్తూ ఇప్పుడు చిరంజీవి స్వయంగా “వాల్తేరు వీరయ్య” అని సినిమా పేరును చెప్పేశారు. విశాఖపట్నం నేపధ్యంలో సాగే ఈ కథనంలో మెగాస్టార్ మాస్ రోల్ లో కనిపించబోతున్నారు. ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ లో శృతి హాసన్ కథానాయికగా నటిస్తుంది, ఇందులో మరో బహుముఖ నటుడు రవితేజ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తోంది. హైదరాబాద్‌లో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది.