Ranga Marthanda: బ్రహ్మానందంకు ‘చిరు’ సత్కారం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Brahmanandam: క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన ‘రంగమార్తాండ’ సినిమా ఉగాది కానుకగా బుధవారం జనం ముందుకు వచ్చింది. మరాఠీ చిత్రం ‘నటసమ్రాట్’కు రీమేక్ అయిన ఈ సినిమాలో టైటిల్ రోల్ ను ప్రకాశ్ రాజ్ పోషించగా, ఆయన ఆప్త మిత్రుడు చక్రపాణి పాత్రను బ్రహ్మానందం చేశారు. వేయికి పైగా చిత్రాలలో వినోదాన్ని పండించిన బ్రహ్మానందం తన ఇమేజ్ కు పూర్తి భిన్నంగా ఇందులో కరుణ రసాన్ని అద్భుతంగా పోషించారంటూ విమర్శకులు సైతం ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. ఇందులో నటించిన ప్రధాన పాత్రధారులందరూ ఒక ఎత్తు అయితే… బ్రహ్మానందం మరో ఎత్తు అని, ఆయన ఏటికి ఎదురీది ప్రేక్షకుల కళ్ళలో నీళ్ళు తెప్పించారని అంటున్నారు. ఇదిలా ఉంటే… ‘రంగమార్తండ’ సినిమా కోసం లక్ష్మీ భూపాల రాసిన షాయరీని చిరంజీవి పాడారు. అలానే బ్రహ్మానందం పాత్రకు లభిస్తున్న ప్రశంసల పట్ల చిరంజీవి సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. బ్రహ్మానందం కెరీర్ ప్రారంభ రోజులలో చిరంజీవి ఆయన్ని ఎంతో ప్రోత్సహించారు. ఇవాళ నటుడిగా బ్రహ్మానందంలోని మరో కోణాన్ని చూసిన ఆయన ప్రత్యేకంగా అభినందించారు. తన తనయుడు రామ్ చరణ్ తో కలిసి చిరంజీవి బ్రహ్మానందాన్ని ప్రత్యేకంగా శాలువతో సత్కరించి, అభినందించారు. దానికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Also Read
- Bhogi: శర్వానంద్ ‘భోగి’కి బ్రేక్.. రిలీజ్ వాయిదా వేసిన మేకర్స్.. అసలు కారణం ఇదే!
- Former Miss India: మాజీ మిస్ ఇండియాకు ఎట్టకేలకు బంపర్ ఆఫర్.. ‘జార్జ్ క్రిష్’లో శర్వానంద్ సరసన ఛాన్స్!
- Telangana Film Chamber: సినిమా థియేటర్ల టికెట్ ధరలపై ప్రభుత్వం పునఃసమీక్ష చేయాలి!
- Shiva Nirvana: రవితేజ ‘ఇరుముడి’లో విలన్ ఎవరో కాదు.. షాక్ ఇచ్చిన డైరెక్టర్ డైరెక్టర్ శివ నిర్వాణ!
తాజావార్తలు
-
Tarique Rahman: భారత్ పర్యటనపై బంగ్లాదేశ్ ప్రధాని యూటర్న్.. కారణమిదేనా?
-
BC Reservation: బీసీలకు గుడ్‌న్యూస్.. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కోటా పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు
-
Rakhi Making at Home: థ్రెడ్, పూసలతో అందమైన రాఖీ.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా
-
TS Inter 2026 : ఇంటర్ పాస్.. మెమోలు రెడీ.. ఎక్కడ తీసుకోవాలంటే.?
-
Former OSD Sumanth : మంత్రి మాజీ ఓఎస్డీపై అటెంప్ట్ మర్డర్ కేసు..
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?