తాజాగా విడుదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం “ఓజి” థియేటర్స్‌లో భారీ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంటుంది. బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేస్తున్న ఈ సినిమా, పఎంటర్‌టైన్‌మెంట్, యాక్షన్, ఎమోషన్స్‌కి పరిమితం కాకుండా పవన్ అభిమానులకు ఒక క్రేజీ ట్రీట్‌గా నిలిచింది. ప్రేక్షకులు ఫస్ట్ షో నుంచి సినిమాను ఘనంగా రిసీవ్ చేసుకున్నారు. దీంతో సినీ రంగంలోని ప్రముఖులు, అభిమానులు సినిమాపై అభినందనలు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి కూడా తన ఆనందాన్ని ట్వీట్ ద్వారా వెల్లడించారు.
Also Read : Ravi Mohan: బ్యాంకు రుణం క్లియర్ చేయకపోవడంతో.. జయం రవి ఇల్లు జప్తు
“కళ్యాణ్ బాబును అందరూ ది ఓజి – ఓజాస్ గంబీరంగా జరుపుకోవడం చూసి చాలా ఆనందంగా ఉంది” అని మెగాస్టార్ ట్వీట్ చేశారు. అలాగే, ఈ సినిమాకు శక్తివంతమైన కథను అందించిన డైరెక్టర్ సుజీత్, భారీ స్థాయిలో నిర్మించిన నిర్మాత డీవీవీ దానయ్య, సంగీతాన్ని అందించిన థమన్, అలాగే మొత్తం తారాగణం, సాంకేతిక నిపుణులను కూడా చిరంజీవి ప్రత్యేకంగా అభినందించారు. “పవన్ కళ్యాణ్, దర్శక సుజీత్, నిర్మాత డీవీవీ దానయ్య, సంగీత దర్శకుడు థమన్ మరియు మొత్తం టీమ్‌కు హృదయపూర్వక అభినందనలు!” అని చిరంజీవి తెలిపారు. దీంతో ఇది, పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఒక మైలురాయి అవుతుంది అని సినీ విశ్లేషకులు అంటున్నారు.
