Site icon NTV Telugu

Mahesh Marriage Anniversary: ఒకే ఫ్రేమ్‌లో బడా స్టార్స్.. పిక్‌తో ఫ్యాన్స్‌కు ట్రీట్

mahesh-babu

టాలీవుడ్ ఆదర్శ దంపతులు సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ 17వ పెళ్లి వార్షికోత్సవం నేడు. ఈ సందర్భంగా మహేష్ అభిమానుల నుంచి సోషల్ మీడియాలో పెళ్లి రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. అయితే మహేష్ మాత్రం నేడు ఏపీ సీఎంతో జరగనున్న భేటీకి హాజరు కానున్నారు. అయితే ఇది కూడా మంచికే అన్నట్టుగా… ఓ అద్భుతమైన పిక్ ను షేర్ చేస్తూ మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ ప్రేక్షకులకు మంచి ట్రీట్ ఇచ్చారు.

Read Also : Mahesh Marriage Anniversary : సూపర్ స్టార్ లో రొమాంటిక్ యాంగిల్… పిక్ తో బయట పెట్టేసిన నమ్రత

ఏపీలో టికెట్ ధర విషయమై తెలుగు సినీ స్టార్స్ సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసేందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు హైదరాబాద్ నుండి కొంతమంది పెద్ద స్టార్స్, దర్శకులు చార్టర్డ్ ఫ్లైట్‌లో బయలుదేరారు. అందులో మహేష్ బాబుతో పాటు చిరంజీవి, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ కూడా ఉన్నారు. ఈ ప్రయాణం సమయంలోనే ఈ బడా స్టార్స్ అంతా కలిసి మహేష్ బాబుకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు. సదరు పిక్ ను చిరు సోషల్ మీడియాలో షేర్ చేయగా, అదిప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. ఒక ఫ్రేమ్ లో మహేష్, చిరంజీవి, ప్రభాస్ వంటి ముగ్గురు బడా స్టార్స్ ను చూడడం నిజంగానే అభిమానులకు ట్రీట్ కదా ! ఇక ఇదే ఫ్రేమ్ లో దిగ్గజ దర్శకుడు రాజమౌళితో పాటు కొరటాల కూడా ఉండనే ఉన్నారు.

Exit mobile version