NTV Telugu Site icon

Chiranjeevi: చిరంజీవి తదుపరి సినిమాకి ముహూర్తం ఫిక్స్

Chiranjeevi Next Movie

Chiranjeevi Next Movie

Chiranjeevi next movie to be launched on August 22nd: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళా శంకర్ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా ఆగస్టు 11వ తేదీ రిలీజ్ అవుతుంది. ఈ క్రమంలో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్ గా తమన్నా భాటియా నటించగా మెగాస్టార్ చిరంజీవి సోదరి పాత్రలో కీర్తి సురేష్ నటించింది. అలాగే ఆమె బాయ్ ఫ్రెండ్ గా అక్కినేని హీరో సుశాంత్ నటించిన ఈ సినిమా ఆగస్టు 11వ తేదీన రిలీజ్ కాబోతోంది. ఇక ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక ఈ సినిమా ముహూర్తం డేట్ అయితే బయటకు వచ్చేసింది. ప్రస్తుతానికి మెగాస్టార్ చిరంజీవి తన భార్య సురేఖతో కలిసి అమెరికాలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. మరి కొద్ది రోజుల్లో అక్కడి నుంచి తిరిగి రానున్న చిరంజీవి భోళా శంకర్ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనబోతున్నారు .

BRO : సినిమాను సరికొత్తగా ప్రమోట్ చేస్తున్న మేకర్స్..

భోళాశంకర్ సినిమాని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించారు. ఇక సినిమా ప్రమోషన్స్ పూర్తయిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు నాడు అంటే ఆగస్టు 22వ తేదీన ఈ సినిమాని అధికారికంగా లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మేరకు ఆయన కుమార్తె కల్యాణ కృష్ణ సినిమాని నిర్మించబోతున్న సుస్మిత కొణిదెల నిర్ణయం తీసుకున్నారు. సుస్మిత గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ అనే సంస్థను ఇప్పటికే స్థాపించి పలు వెబ్ సిరీస్ లు, ఒక సినిమాను నిర్మించింది. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన త్రిషా నటించబోతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో మరో యంగ్ హీరోకి కూడా అవకాశం ఉంది. అయితే సిద్దు జొన్నలగడ్డని ముందు నుంచి కన్సిడర్ చేయగా ఆయన తనకు డేట్స్ కుదరవని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపద్యంలో శర్వానంద్ లేదా వరుణ్ తేజ్ లో ఒకరిని ఫైనల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Show comments