మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో “మన శంకర్ వరప్రసాద్ గారు” అనే సినిమా రూపొందుతోంది. నయనతార హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే భారీ అంచనాలున్నాయి. దానికి తోడు, సినిమా నుంచి రిలీజ్ అవుతున్న ప్రతి అప్డేట్ ఆ సినిమా మీద అంచనాలు పెంచేలానే ఉంది. ఈ నేపథ్యంలో, సుమారు 13 రోజుల క్రితం రిలీజ్ అయిన “మీసాల పిల్ల” సాంగ్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. తాజాగా ఈ సాంగ్ మరో ఆసక్తికరమైన రికార్డు సాధించింది. అదేమిటంటే, రిలీజ్ అయిన రోజు నుంచి సుమారు 13 రోజులపాటు యూట్యూబ్లో #1 ట్రెండింగ్‌లో ఉంది.
Also Read : Chiranjeevi Deepfake Case: AI మార్ఫింగ్ షాక్ – చిరంజీవిపై అశ్లీల వీడియోలు వైరల్!
ఈ మధ్యకాలంలో ఒక సాంగ్ ఈ రేంజ్ రెస్పాన్స్ సాధించడం చాలా అరుదనే చెప్పాలి. ఇక ఈ సాంగ్ రిలీజ్ అయిన మొదట్లో భిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి కానీ, నెమ్మదిగా స్లో పాయిజన్‌లా ఈ సాంగ్ అందరికీ ఎక్కేసింది. కోట్ల వ్యూస్‌తో పాటు లక్షలలో రీల్స్, షార్ట్స్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాను మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుష్మితతో కలిసి నిర్మాత సాహు గారపాటి నిర్మిస్తున్నారు. భీమ్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా సంగీతం మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి.
