Site icon NTV Telugu

Akhanda 2 Vs MSVG: ‘అఖండ 2’ ఫుల్ రన్‌ ప్రీమియర్స్’తో కొట్టిన శంకర వరప్రసాద్ గారు!

Msvg Akhanda 2

Msvg Akhanda 2

మెగాస్టార్ చిరంజీవి అంటేనే రికార్డుల రారాజు, ఆయన వెండితెరపై కనిపిస్తే బాక్సాఫీస్ వద్ద పూనకాలే. తాజాగా సంక్రాంతి కానుకగా విడుదలైన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం అమెరికా గడ్డపై సరికొత్త చరిత్రను లిఖించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా, ఓవర్సీస్ మార్కెట్‌లో మెగాస్టార్ స్టామినాను మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది. ఒకప్పుడు మెగాస్టార్ రీ-ఎంట్రీ మూవీ ‘ఖైదీ నంబర్ 150’ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఆ సినిమా ప్రీమియర్స్ సమయంలో ట్యూస్డే అడ్వాంటేజ్‌తో పాటు ‘T-Mobile’ వారి 2 డాలర్ల ఆఫర్ కూడా తోడైంది. అయితే, ఏలాంటి ఆఫర్లు లేకపోయినా, వీకెండ్ ముగిసే ఆదివారం రాత్రి ప్రీమియర్స్ పడినా ‘మన శంకర వరప్రసాద్ గారు’ఆ రికార్డులను అలవోకగా తుడిచిపెట్టేసింది. కేవలం ప్రీమియర్స్ తోనే 1.5 మిలియన్ డాలర్ల మార్కును దాటేసి, నార్త్ అమెరికాలో సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసింది.

Also Read:Anchor Shyamala: రెడ్‌ బుక్‌పై యాంకర్‌ శ్యామల హాట్‌ కామెంట్స్‌.. కోడి కోసినా.. కేక్‌ కట్ చేసినా కేసులే..!

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, బాలకృష్ణ నటించిన ‘అఖండ 2’ చిత్రం నార్త్ అమెరికాలో తన ఫుల్ రన్లో దాదాపు ఒక మిలియన్ డాలర్ల వరకు వసూలు చేసింది. కానీ, మెగాస్టార్ మేనియాతో ప్రీమియర్ షోల ద్వారానే ఆ చిత్రాన్ని దాటేసి, బాక్సాఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఆదివారం ప్రీమియర్స్ జరగడం, సోమవారం వర్కింగ్ డే ఉన్నప్పటికీ $1.5 మిలియన్ (దాదాపు 12.5 కోట్లు) స్థాయి వసూళ్లు రావడం గమనార్హం. అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ మరియు వింటేజ్ మెగాస్టార్ మేనరిజమ్స్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాయి. సంక్రాంతి సీజన్ లో విడుదలైన ఇతర సినిమాల పోటీని తట్టుకుని ఈ విజయం సాధించడం విశేషం. మెగాస్టార్ చిరంజీవి గారి ఎనర్జీ, దానికి తోడు వెంకటేష్ గారి క్యామియో అప్పియరెన్స్ సినిమాకు ప్రధాన బలంగా మారాయి, ఈ వేగం చూస్తుంటే, లాంగ్ రన్‌లో ఈ సినిమా మరిన్ని రికార్డులను కొల్లగొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

Exit mobile version