NTV Telugu Site icon

Chiranjeevi: చిరంజీవి మోకాలి సర్జరీ.. ఇప్పుడు ఎలా ఉన్నారంటే..?

Chiranjeevi

Chiranjeevi

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి .. భోళా శంకర్ తో భారీ పరాజయాన్ని అందుకున్న విషయం తెల్సిందే. ఈ సినిమా తరువాత చిరు లైనప్ చాలా పెద్దగా ఉంది. కళ్యాణ్ కృష్ణ, వశిష్ఠ చిత్రాలు అధికారికంగా ప్రకటించారు. ఇక మరో మూడు సినిమాలు లైనప్ లో ఉన్నాయి. గత కొన్ని ఏళ్లుగా రీమేక్ లతో ప్లాప్స్ అందుకున్న చిరు ఇకనుంచి రీమేక్స్ జోలికి పోకుండా కొత్త కథలను.. కుర్ర డైరెక్టర్లను నమ్ముకొని ముందుకు వెళ్తున్నాడు. ఇక ఈ మధ్యనే చిరంజీవి.. మోకాలికి సర్జరీ జరిగిన విషయం తెల్సిందే. భోళా శంకర్ సినిమా రిలీజ్ కు ముందే చిరు విదేశాలకు వెళ్లి మోకాలికి సర్జరీ చేయించుకొని ఇండియా వచ్చాడు. అప్పటినుంచి ఆయన ఇంటికే పరిమితమయ్యాడు.

Rules Ranjann Review: రూల్స్ రంజన్ రివ్యూ

ప్రస్తుతం ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్న చిరుకు.. ఆక్వా థెరపీ, ఫిజియో థెరపీ లాంటివి ట్రీట్ మెంట్ లు జరుగుతున్నాయట.. అంతేకాకుండా ఇప్పడిప్పుడే ఇంట్లో చిరు ఒక్కడే నడవడం ప్రాక్టీస్ చేస్తున్నాడని, ఏ సపోర్ట్ లేకుండా నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఇక నేడు సురేష్ కొండేటిని కలిసిన చిరు ఫోటోలు కూడా నెట్టింట వైరల్ గా మారాయి. ఈ విషయం తెలియడంతో అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఇక చిరు హెల్త్ .. నవంబర్ లోపు పూర్తిగా కోలుకుంటుందని సమాచారం. చిరు తదుపరి సినిమాలు అన్ని నవంబర్ నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్నాయి. మరి ఈ కుర్ర డైరెక్టర్లు చిరుకు ఎలాంటి హిట్లు అందిస్తారో చూడాలి.