Site icon NTV Telugu

Kodamasimham re-release : ‘కొదమసింహం’ ట్రైలర్‌ రిలీజ్‌తో ఫ్యాన్స్‌ ఫిదా..

Kodamasimham

Kodamasimham

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటించిన క్లాసిక్‌ కౌబాయ్‌ చిత్రం ‘కొదమసింహం’ 90వ దశకంలో ప్రేక్షకులను అలరించింది. 1990 ఆగస్టు 9న విడుదలైన ఈ సినిమా, అప్పట్లో చిరంజీవి అభిమానుల్లో భారీ క్రేజ్‌ సృష్టించింది. యాక్షన్‌, డ్యాన్స్‌, మాస్‌ ఎలిమెంట్స్‌తో పాటు కౌబాయ్‌ స్టైల్‌లో చిరు మేనరిజమ్స్‌ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.కె. మురళీమోహన్‌రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాధ, సోనం, వాణీ విశ్వనాథ్ హీరోయిన్లుగా నటించగా, రమా ఫిలింస్‌ బ్యానర్‌పై కైకాల నాగేశ్వరరావు ఈ సినిమాను నిర్మించారు. ఇప్పుడు రీ-రిలీజ్‌ల ట్రెండ్‌ ఊపందుకున్న తరుణంలో, మెగాఫ్యాన్స్‌ కోసం ఈ క్లాసిక్‌ను మళ్లీ తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు పూర్తయ్యాయి.

Also Read : Vijay–Rashmika: నిశ్చితార్థ రూమర్స్‌కి చెక్.. సక్సెస్ ఈవెంట్‌లో రష్మికతో విజయ్‌ స్పెషల్ మూమెంట్‌!

కాగా ‘కొదమసింహం’ను ఈ నెల 21న దేశవ్యాప్తంగా గ్రాండ్‌గా రీ-రిలీజ్‌ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్రబృందం ట్రైలర్ విడుదల చేసింది. 4K క్వాలిటీతో కొత్త వెర్షన్‌ను సిద్ధం చేసింది. డిజిటల్‌ సౌండ్‌, కలర్‌ కరెక్షన్‌, అద్భుతమైన విజువల్‌ ట్రీట్‌తో ప్రేక్షకులు కొత్త అనుభూతిని పొందబోతున్నారు. రీ-రిలీజ్‌ ట్రైలర్‌ను మెగాస్టార్‌ చిరంజీవి స్వయంగా తన సోషల్ మీడియాలో విడుదల చేశారు. చిరు వింటేజ్‌ స్టైల్‌, అదిరిపోయే డ్యాన్స్‌ మూవ్స్‌, ఎమోషన్‌తో నిండిన సన్నివేశాలు మళ్లీ ఫ్యాన్స్‌లో నోస్టాల్జియా రేపుతున్నాయి. నిర్మాత కైకాల నాగేశ్వరరావు మాట్లాడుతూ “కొదమసింహం సినిమాను 4Kలో రీ-మాస్టర్‌ చేశాం. ఈ కొత్త వెర్షన్‌లో మెగాస్టార్‌ ఎనర్జీని మరోసారి థియేటర్లలో ఫీలవ్వాలని అభిమానులు తప్పకుండా చూడాలి,” అని తెలిపారు.

 

Exit mobile version