Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక సినిమాల విషయం పక్కన పెడితే నిత్యం ఏదో ఒక మీటింగ్ లో మీడియా ముందు కనిపిస్తూ తనకు తోచిన అభిప్రాయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు. ముఖ్యంగా తమ్ముడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడమంటే ఎంతసేపైనా మాట్లాడతాడు. తాజాగా నేడు చిరంజీవి తన చిన్ననాటి స్నేహితులను కలిశాడు. పూర్వ స్నేహితుల సమ్మేళన కార్యక్రమంలో చిరు, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడి ఆశ్చర్యపరిచాడు. పవన్ రాజకీయాలకు సరైన వ్యక్తి అని, పవన్ వెనుక మీరు ఉన్నారనే దైర్యం ఉందని చెప్పుకొచ్చాడు.
“నేను జీవితంలో అనుకున్నవి అన్నీ చేశాను. కానీ ఒక్కదాంట్లో మాత్రం అంతుచూడలేకపోయా. రాజకీయాల్లో రాణించాలంటే రాటు తేలాలి, మాటలు అనాలి, మాటలు పడాలి.. నాకు అవసరమా?. కానీ పవన్ కల్యాణ్ మాత్రం అలా కాదు. ఆయన మాటలు అంటాడు. మాటలు పడతాడు. పవన్ కల్యాణ్‌కు మీరందరు ఉన్నారు. మీ ఆశీస్సులతో ఏదో ఒకరోజు అత్యున్నత స్థానంలో పవన్‌ని చూస్తాం”అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఎప్పటినుంచో జనసేనకు చిరు సపోర్ట్ ఉంటుందా..? ప్రచారానికి మెగా ఫ్యామిలీ వస్తుందా..? అనే అనుమానాలు ఉన్నాయి. అయితే దీనికి చిరు ఎప్పుడు చెప్పే మాటనే చెప్పుకొచ్చాడు. తానెప్పుడు పవన్ కు అండగా ఉంటానని, పవన్ కు తన అవసరం ఉందని తెలిస్తే తప్పకుండా తాను తనవంతు కృషి చేస్తాను అని తెలిపాడు. ఇక చెప్పినట్లుగన్ తమ్ముడి రాజకీయం గురించి, ఆయన పడుతున్న కష్టం గురించి ఏదో ఒక సమయంలో మాట్లాడుతూ బూస్ట్ ఇస్తున్నాడు అని జనసేన అభిమానులు అంటున్నారు.
