NTV Telugu Site icon

Chiranjeevi: రజనీ ‘జైలర్’ కామెంట్స్.. చిరంజీవి చురకలు?

Chiranjeevi Rajanikanth

Chiranjeevi Rajanikanth

Chiranjeevi indirectly mocked Rajinikanth says Netizens: ఇదేంటి రజనీకాంత్ జైలర్ సినిమా మీద మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడు చురకలు అంటించారు? అని అనుమాన పడకండి. నిజానికి మెగాస్టార్ చిరంజీవి ఎవరినీ ఉద్దేశించి ఏమీ అనలేదు. ఈ మధ్య ఒక సీనియర్ జర్నలిస్ట్ రాసిన పుస్తకాన్ని మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించారు. ఈ క్రమములోనే చిరంజీవి చాలా విషయాలు పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ రీరికార్డింగ్, బీజీఎంతో ఎలివేట్ అయ్యే హీరోయిజం తన సినిమాలకు అవసరం లేదని కామెంట్ చేశారు. అయితే ఈ కామెంట్స్ జైలర్ సినిమా గురించి రజనీ చేసిన కామెంట్స్ ను ఉద్దేశించి చేసినవే అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్. ఆ మధ్య ‘జైలర్’ సినిమా సక్సెస్ మీట్ జరగగా రజనీకాంత్ సంగీత దర్శకుడు అనిరుధ్ పై ప్రశంసలు కురిపించారు.

Martin Luther King : సెకండ్ సింగిల్ పై అప్డేట్ ఇచ్చిన మేకర్స్…

సినిమా విజయానికి సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ కారణమని, సినిమా సూపర్ హిట్ అవ్వడానికి అనిరుధ్ ఇచ్చిన బీజీఎం కారణమని అన్నారు. రీరికార్డింగ్‌కి ముందు సినిమా చూసినప్పుడు అంతగా నిపించలేదు, యావరేజ్‌గా ఉందనిపించింది కానీ మ్యూజిక్ యాడ్ అయిన తర్వాత సినిమా నెక్స్ట్ లెవల్ కు వెళ్ళిందని తన మ్యూజిక్ తో అనిరుధ్ సినిమాను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాడని అన్నారు. ఇప్పుడు మెగాస్టార్ మాట్లాడుతూ తన సినిమా అంటే డ్యాన్సులు ఫైట్స్ తప్పకుండా ఉండాల్సిందే అని, ఫ్యాన్స్ ఆవే ఆశిస్తున్నారని, ప్రొడ్యూసర్స్ కూడా తాను ఒళ్ళోంచి కష్టపడి డ్యాన్స్ లు ఫైట్స్ చేస్తేనే ఆనందపడతారని అన్నారు. తనకు కూడా ఫైట్స్ డ్యాన్సులు మానేసి మేకప్ తీసేసి, స్టైల్ గా నడుస్తూ బీజీఎంతో హీరోయిజాన్ని ఎలివేట్ చేసే సినిమాలు చేస్తూ రిలాక్స్ అవ్వాలని ఉంది కానీ, అలా చేస్తే ఆడియన్స్ తనని యాక్సెప్ట్ చేసే స్టేజ్ లో లేరని అన్నారు. ఈ రోజుల్లో మ్యూజిక్ డైరెక్టర్స్ బీజీఎంతోనే మ్యాజిక్ చేస్తున్నారని, సీన్లో విషయం లేకున్నా కూడా తమ టాలెంట్ తో బ్లాక్ బస్టర్ రేంజ్ కి తీసుకెళ్తున్నారని ఆయన అన్నారు. మొత్తానికి చిరు తన అభిప్రాయం చెప్పగా ఆ కామెంట్స్ ని జైలర్ సినిమాకు లింక్ చేస్తున్నారు నెటిజన్లు.