Site icon NTV Telugu

ఊటీలో మొదలైన చిరు ‘గాడ్ ఫాదర్’ షూటింగ్

చిరంజీవి కథానాయకుడుగా తెరకెక్కుతున్న ‘లూసిఫర్’ రీమేక్ ‘గాడ్ ఫాదర్’ షూటింగ్ బుధవారం నుంచి ఊటీలో మొదలైంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిలిమ్స్ ట్వీట్ ద్వారా తెలియచేసింది. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమాకు పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఈ సినిమాను మోహన్ రాజా దర్శకత్వంలో సూపర్ గుడ్ ఫిలిమ్స్ పతాకంపై ఎన్వీ ప్రసాద్, ఆర్.బి.చౌదరితో కలసి రామ్ చరణ్‌ నిర్మిస్తున్నారు. ఇందులో కీలకమైన సిస్టర్ పాత్రకు నటినిఎంపిక చేయాల్సి ఉంది. అలాగే పవర్ ఫుల్ విలన్ పాత్రతో పాటు చిరుకు సాయంగా ఉండే పాత్రలు పోషించే నటీనటులను ప్రకటించాల్సి ఉంది. ఈ సినిమాకు థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Exit mobile version