Chiranjeevi: టాలీవుడ్ కు ఐకాన్ అంటే మెగాస్టార్ చిరంజీవి. కష్టంతో పైకి వచ్చిన హీరో అంటే చిరంజీవి. మొదటి బ్రేక్ డ్యాన్స్ చేసింది ఎవరు అంటే చిరంజీవి. ఎవరిని చూసి హీరో అవ్వాలనుకున్నారు అంటే చిరంజీవి. ఎవరినైనా ఆదుకోవాలి అంటే చిరంజీవి. చిత్ర పరిశ్రమలో ఆ పేరు లేకుండా ఏది జరగదు అంటే అతిశయోక్తి కాదు. మెగాస్టార్ అని బ్రాండ్ సంపాదించుకోవడం కాదు. దాన్ని నిలబెట్టుకుంటూ వస్తున్నాడు చిరంజీవి. ఇండస్ట్రీకి పెద్దగా కాకుండా కళామ్మ తల్లి ముద్దబిడ్డగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ.. ఎంతోమంది హృదయాలను గెలుచుకున్నాడు. ఇక ఇండస్ట్రీలో చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అందరికి సపోర్ట్ చేయడంలో మెగాస్టార్ ముందు ఉంటాడు. ముఖ్యంగా తనను నమ్మినవారికి ఏరోజు కూడా వెన్ను చూపడు. తనవలం ఏ సినిమాకైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే.. పోస్టర్స్ రిలీజ్ చేయడం దగ్గరనుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా వెళ్లడం వరకు చేస్తూనే ఉంటాడు.
తాజాగా చిరు.. హనుమాన్ కు అండగా నిలిచాడు. తేజ సజ్జా, అమ్రితా అయ్యర్ జంటగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హనుమాన్. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. ఇప్పటికే హనుమాన్ నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరుగుతుంది. ఈ ఈవెంట్ కు చిరు ముఖ్య అతిధిగా విచ్చేశాడు. ఇక ఈవెంట్ లోపలి అడుగుపెట్టడం ఆలస్యం.. మెగాస్టార్.. మెగాస్టార్ అంటూ అభిమానులు అరవడం మొదలుపెట్టారు. చిరు నామస్మరణంతో స్టేజి మొత్తం దద్దరిల్లింది. వైట్ కలర్ షర్ట్ తో చాలా సింపుల్ గా చిరు ఈవెంట్ కు వచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. అక్కడ వచ్చింది మెగాస్టార్ రా.. ఎన్నేళ్లు అయినా ఆ క్రేజ్ తగ్గేదేలే అని చిరు ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
Mega 🌟 @KChiruTweets at the 'Celebrating #HANUMAN Mega Pre-Release Utsav' 💥
– https://t.co/NHkij4pbjoA @PrasanthVarma Film
🌟ing @tejasajja123In WW Cinemas from JAN 12, 2024 🔥#HanuManOnJAN12th@Niran_Reddy @Actor_Amritha @varusarath5 @VinayRai1809 @GowrahariK… pic.twitter.com/I2sau2P82j
— Vamsi Kaka (@vamsikaka) January 7, 2024