NTV Telugu Site icon

Chiranjeevi on ANR : భారతీయ సినీ చరిత్రలోనే దిగ్గజ నటుడు.. ప్రేక్షక హృదయాల్లో నిలిచిన నట సామ్రాట్

Chiranjeevi Pawan Kalyan On Anr

Chiranjeevi Pawan Kalyan On Anr

Chiranjeevi Emotional Tweet on ANR: అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆయనతో తమకు ఉన్న అనుభూతిని, అనుభవాలను పంచుకుంటున్నారు సినీ ప్రముఖులు. ఇక తాజాగా చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఆయనతో తమకు ఉన్న మెమోరీస్ షేర్ చేసుకున్నారు. చిరంజీవి ట్వీట్ చేస్తూ శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆప్యాయంగా, గౌరవపూర్వకంగా ఆ మహానటుడికి నివాళులర్పిస్తున్నాననీ అన్నారు. ఆయన తెలుగు సినిమాకే కాదు భారతీయ సినీ చరిత్రలోనే ఓ దిగ్గజ నటుడు అని, ఆయన నటించిన వందలాది చిత్రాల ద్వారా ఆయన నటనా పటిమ, తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసిందనీ అన్నారు. తెలుగు సినిమా బ్రతికినంత వరకు శ్రీఅక్కినేని నాగేశ్వరరావుగారు తెలుగు ప్రేక్షకుల మనస్సుల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారు అని పేర్కొన్న చిరంజీవి ఆ మహానుభావుడి శత జయంతి సందర్భంగా అక్కినేని కుటుంబంలోని ప్రతి ఒక్కరికి, నా సోదరుడు నాగర్జునకి, నాగేశ్వరరావుగారి కోట్లాది అభిమానులకు, సినీ ప్రేమికులందరికీ నా హృదయ పూర్వక శుభాకాంక్షలు అని రాసుకొచ్చారు. ఇక మరోపక్క పవన్ కళ్యాణ్ కూడా ఒక లేఖ విడుదల చేశారు.

SS Rajamouli: ఓకే రూములో ఏఎన్ఆర్, రాజమౌళి.. ఆ రహస్యం చెప్పారన్న జక్కన్న!

Pawan Kalyan Emotional Note on ANR: తెలుగు చలన చిత్ర చరిత్రలో దివంగత అక్కినేని నాగేశ్వరరావు గారిది ప్రత్యేక అధ్యాయం అని సాత్వికాభినయంతో శ్రీ నాగేశ్వర రావు గారు పోషించిన విభిన్నమైన పాత్రలను సినీ ప్రియులు ఎప్పుడూ గుర్తు చేసుకొంటూనే ఉంటారని అన్నారు. ఆ మహా నటుడి శత జయంతి వేడుకలు నేడు మొదలయిన సందర్భంలో మనస్ఫూర్తిగా అంజలి ఘటిస్తున్నానని పవన్ పేర్కొన్నారు. ఇక ఒక దేవదాసు… ఒక మజ్ను… డాక్టర్ చక్రవర్తి… దసరా బుల్లోడు… బాటసారి… విప్రనారాయణ.. భక్త తుకారాం… బాలరాజు.. సీతారామయ్య గారు… ఇలా ఏ పాత్ర, ఏ చిత్రం ప్రస్తావించుకున్నా శ్రీ అక్కినేని నాగేశ్వర రావు గారి అభినయం కళ్ళలో మెదులుతుందని, మరపురాని పాత్రలతో ప్రేక్షక హృదయాల్లో నిలిచిన నట సామ్రాట్ ఆయన అని పేర్కొన్నారు. ఇక స్వతహాగా నాస్తికత్వాన్ని విశ్వసించినా వెండి తెరపై భక్తి భావనలు పంచే పాత్రల్లో ఒదిగిపోయిన విధానం ఒక నటుడు పాత్రను ఎంతగా జీర్ణించుకోవాలో ఆయన చిత్రాల ద్వారా తెలుస్తుందని, కరుణ రస ప్రధానంగా విషాదాన్ని పలికించడంలో ఆయన శైలి విభిన్నమైనదని అన్నారు. ప్రేమ కథలకు, నవలా చిత్రాలకు చిరునామాగా నిలిచారని పేర్కొన్న పవన్ కృషి, పట్టుదలతో చలన చిత్రసీమలో శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు ఎదిగిన క్రమం నవతరానికి మార్గ దర్శనం చేస్తుందని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.

Show comments