Site icon NTV Telugu

Chiranjeevi : మనవడిని చూసి మురిసిపోతున్న చిరంజీవి..

Chiranjeevi

Chiranjeevi

Chiranjeevi : మెగా ఫ్యామిలీలోకి కొత్త వారసుడు వచ్చేశాడు. వరుణ్‌ తేజ్-లావణ్య దంపతులకు ఈ రోజ ఉదయం పండంటి మగబిడ్డ జన్మించాడు. దీంతో మెగా ఫ్యామిలీలో సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి. మనవడిని చూసేందుకు మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడితో చేస్తున్న మన శంకర వర ప్రసాద్ గారు మూవీ షూటింగ్ ను మధ్యలో ఆపి రెయిన్ బో హాస్పిటల్ కు వచ్చేశారు. తన మనవడిని ఎత్తుకుని మురిసిపోయారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read Also : Bigg Boss 9 : బిగ్ బాస్-9 లో మరో లవ్ ట్రాక్.. ఏం జరుగుతోంది..?

చిరంజీవి మనవడిని ఎత్తుకోగా.. పక్కనే వరుణ్‌ తేజ్ కూడా ఉన్నాడు. ఒకే ఫ్రేమ్ లో ఈ ముగ్గురూ ఉండటం ఆకట్టుకుంటోంది. అటు మిగతా మెగా హీరోలు కూడా రెయిన్ బో హాస్పిటల్ కు వస్తున్నారు. రామ్ చరణ్‌ కూడా హాస్పిటల్ కు బయలు దేరి వస్తున్నాడు. వరుణ్‌ తేజ్, లావణ్య ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ కలిసి ఓ సినిమాలో పనిచేశారు. అప్పుడే ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి లావణ్య సినిమాలు మానేసి ఇంటికే పరిమితం అయిపోయింది. ఇప్పుడు కొడుకు పుట్టడంతో నాగబాబు కుటుంబంలో సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.

Read Also : Varun Tej & Lavanya : మెగా కుటుంబంలో కొత్త అతిథి.. వరుణ్ తేజ్-లావణ్యకు బేబీ బాయ్

Exit mobile version