Site icon NTV Telugu

chiranjeevi-CP Sajjanar: మెగాస్టార్‌ డీప్‌ఫేక్‌ ఘటనపై కఠిన చర్యలు – సీపీ సజ్జనార్ సీరియస్ వార్నింగ్

Chiranjeevi Deepfake Case Cp Sajjanar

Chiranjeevi Deepfake Case Cp Sajjanar

మెగాస్టార్ చిరంజీవి డీప్‌ ఫేక్‌ కేసు ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ కేసు విచారణపై సైబరాబాద్ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్ స్పందించారు. “చిరంజీవి గారి ఫిర్యాదు మేరకు ఇప్పటికే కేసు నమోదు చేశాం. అశ్లీలంగా మార్ఫింగ్‌ చేసిన కేటుగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటాం. మూలాలను గుర్తించి, బాధ్యులైన నిందితులను తప్పకుండా అరెస్ట్‌ చేస్తాం” అని ఆయన స్పష్టం చేశారు.

Also Read : Allu Arjun – Atlee : అల్లు అర్జున్ – అట్లీ సినిమా నుంచి కొత్త అప్‌డేట్..

సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. “ఇలాంటి డీప్‌ ఫేక్‌ వీడియోలు, మార్ఫింగ్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో విపరీతంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా సెలబ్రిటీలను టార్గెట్‌ చేసే కేసులు రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. అందుకే దీనిపై ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేశాం. ఆ టీమ్‌ ఆధునిక సాంకేతిక పద్ధతుల్లో విచారణ చేపడుతుంది. ఎవరైనా సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను దుర్వినియోగం చేస్తే తప్పించుకోలేరు” అని హెచ్చరించారు. అదే సమయంలో చాదర్ ఘాట్ కాల్పుల కేసుపై కూడా సీపీ స్పందిస్తూ.. “ఆ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే కీలకమైన ఆధారాలు లభించాయి. త్వరలో ఆ కేసుకు సంబంధించిన అన్ని వివరాలు మీడియాకు వెల్లడిస్తాం” అని తెలిపారు.

Exit mobile version