Site icon NTV Telugu

Chiranjeevi: గ్రామీ అవార్డుల్లో భారత్‍కు పురస్కారాల పంట.. కంగ్రాట్స్ చెప్పిన చిరు

Chiru

Chiru

Chiranjeevi: ప్రపంచ సంగీత రంగంలో అత్యంత ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం ఈ మధ్యనే జరిగిన విషయం తెల్సిందే. ఈసారి మీ అవార్డుల్లో భారత్‍కు పురస్కారాల పంట పండింది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. ఐదుగురు సంగీత కళాకారులను గ్రామీ అవార్డు వరించింది. ప్రఖ్యాత తబలా కళాకారుడు జాకీర్‌ హుస్సేన్, వేణుగాన విద్వాంసుడు రాకేశ్‌ చౌరాసియా, గాయకుడు శంకర్‌ మహాదేవన్, వయోలిన్‌ కళాకారుడు గణేశ్‌ రాజగోపాలన్, డ్రమ్స్‌ కళాకారుడు సెల్వగణేశ్‌ వినాయక్‌రామ్‌ను గ్రామీలు వరించాయి. శంకర్ మహదేవన్, ఉస్తాద్ జాకీర్ హుసేన్ ఉన్న భారత్‍కు చెందిన శక్తి మ్యూజికల్ బ్యాండ్‍కు బెస్ట్ గ్లోబల్ ఆల్బమ్ అవార్డు వచ్చింది. ఇక దీంతో సోషల్ మీడియాలో వారికి శుభాకాంక్షలు వెల్లువలా విరిశాయి. తాజాగా చిరంజీవి.. గ్రామీ అవార్డులకు శుభకాంక్షలు తెలిపారు. లేట్ గా చెప్పినా కూడా ఎంతో మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.

“గ్రామీల వద్ద భారత జెండా ఎత్తుగా ఎగురుతుంది. పార్టీలో చేరడం కాస్త ఆలస్యం అయ్యింది. గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ గెలుచుకున్న అద్భుతమైన టీమ్ శక్తికి హృదయపూర్వక అభినందనలు. జాకీర్ తబ్లా ఉస్తాద్ కు, శంకర్ మహదేవన్ కు, సెల్వగణేష్, గణేష్ రాజగోపాలన్ ఈ ఏడాది గ్రామీలలో అద్భుతమైన మూమెంట్ గా చేశారు. శంకర్ మహదేవన్ తో నాకు వ్యక్తిగత అనుబంధం ఉన్నందుకు ఆనందంగా ఉంది. అతను నా కోసం పాడిన కొన్ని అద్భుతమైన పాటలను పాడారు. మీరు మా అందరికీ గర్వకారణం మరియు మీ అద్భుతమైన విజయాలు మిలియన్ల మంది భారతీయులకు స్ఫూర్తినిస్తాయి” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

Exit mobile version