Site icon NTV Telugu

చిరు 43 ఏళ్ళ ప్రయాణం… చరణ్ స్పెషల్ ట్వీట్

Chiranjeevi Completes 43 Years in TFI

సెప్టెంబర్ 22న మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఓ ప్రత్యేకమైన రోజు. చిత్ర పరిశ్రమలో ఆయన విజయవంతంగా 43 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తనయుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ రోజు ఓ స్పెషల్ ట్వీట్ చేస్తూ “43 ఇయర్స్ అండ్ స్టిల్ కౌంటింగ్… మై అప్పా” అంటూ లవ్ సింబల్ ను యాడ్ చేశారు. అంతేకాకుండా 43 ఏళ్ళ క్రితం నాటి ఫోటో, తాజాగా ఆయన నటిస్తున్న ఆచార్య సినిమాలోని పిక్ ను షేర్ చేశారు.

ఇక చిరు నిన్ననే తన కెరీర్‌లో అంతులేని మద్దతునిచ్చిన అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ తన సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేశారు. ఆ రోజులను గుర్తు చేసుకుంటూ చిరంజీవి తన తొలి సినిమా” ప్రాణం ఖరీదు” నుండి త్రోబాక్ చిత్రాన్ని పంచుకున్నారు. “ఆగస్టు 22న నేను మనిషిగా జన్మించాను. సెప్టెంబర్ 22న నేను నటుడిగా జన్మించాను. కళామతల్లి నన్ను అక్కున చేర్చుకున్న రోజు. మీ అందరికి నన్ను నటుడిగా పరిచయం చేసి మీ ఆశీస్సులు పొందిన రోజు. నేను మరిచిపోలేనిరోజు. అప్పటి నుండి నన్ను ప్రోత్సహించిన ప్రేక్షకులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్న నా అభిమానులకు నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను” అంటూ చిరు ట్వీట్ చేశారు.

Read Also : కాస్ట్లీ కారు కొన్న “బిగ్ బాస్” బ్యూటీ

సెప్టెంబర్ 22, 1978 న “ప్రాణం ఖరీదు”తో చిరంజీవి అరంగేట్రం చేశారు. సరిగ్గా ఒక నెల క్రితం ఆగస్టు 22 న చిరు తన 66వ పుట్టినరోజును జరుపుకున్నాడు. ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న “ఆచార్య”లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ మరియు పూజా హెగ్డే ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. మోహన్ రాజాతో “గాడ్ ఫాదర్”, మెహర్ రమేష్‌తో “భోళా శంకర్”, దర్శకుడు బాబీతో ఒక సినిమా లైన్ లో పెట్టారు చిరు.

Exit mobile version