Site icon NTV Telugu

Chiranjeevi: శ్రీకాంత్ బర్త్ డే.. ఇంటికెళ్లి మరీ సెలబ్రేట్ చేసిన చిరు

Srikanth

Srikanth

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి గురించి కానీ, ఆయన మంచి మనసు గురించి కానీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీకి ఏదైనా సమస్య వచ్చినా ముందుడేది ఆయనే. ఇండస్ట్రీలో తన అనుకున్నవారిని జాగ్రత్తగా చూసుకొనేది ఆయనే. చిరుకు మొదటి నుంచి ఒక ప్రత్యేకమైన అలవాటు ఉంది. తన అనుకున్నవారి పుట్టినరోజున.. వారింటికి వెళ్లి వారి పుట్టినరోజును సెలబ్రేట్ చేస్తారు. ఇలా ఎంతోమంది ప్రముఖుల ఇంటికి వెళ్లి చిరు బర్త్ డే జరిపిన ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ గా మారాయి. ఇక తాజాగా చిరు.. నేడు హీరో శ్రీకాంత్ పుట్టినరోజును సెలబ్రేట్ చేశారు. వీరిద్దరి మధ్య బంధం గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

చిరు- శ్రీకాంత్.. శంకర్ దాదా MBBS చిత్రంలో నటించారు. ఎటిఎం గా శ్రీకాంత్ నటన ఇప్పటికీ అభిమానులు మర్చిపోలేరు. ఇక సినిమాలోనే కాకుండా బయట కూడా శ్రీకాంత్ కు చిరు పెద్ద అన్నయ్య అని చెప్పొచ్చు. శ్రీకాంత్.. చిరు కుటుంబానికి సన్నిహితుడు అని చెప్పొచ్చ. ఇక నేడు శ్రీకాంత్ పుట్టినరోజును గుర్తుపెట్టుకొని ఒక స్పెషల్ కేక్ తీసుకొని.. శ్రీకాంత్ ఇంటికి వెళ్లిన చిరు.. ఆయన చేత కేక్ కట్ చేయించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోలలో శ్రీకాంత్ కొడుకు రోషన్ కూడా ఉన్నాడు. ప్రస్తుతం శ్రీకాంత్ వరుస సినిమాలు చేస్తున్నాడు. రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ లో ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు.

Exit mobile version