Chiranjeevi Birthday: శివశంకర వరప్రసాద్ నుంచి మెగాస్టార్ వరకు.. 71 ఏళ్లలోనూ చెక్కుచెదరని చిరు ప్రభంజనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chiranjeevi Birthday: తెలుగు సినిమా చరిత్రలో కొన్ని పేర్లు ప్రేక్షకుల హృదయాలలో చిరకాలం నిలిచిపోతాయి. యన్. టి. ఆర్ తరువాత అలాంటి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తిగా మెగాస్టార్ పేరు ముందు ఉంటుంది. తెలుగు సినిమా గురించి మాట్లాడేటప్పుడు చిరంజీవికి ముందు.. చిరంజీవి తర్వాత అనే మాట ఎందుకు వినిపిస్తుందో ఆయన ప్రయాణమే చెబుతుంది. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి, తన కష్టం, క్రమశిక్షణ, అద్భుతమైన నటన, డ్యాన్స్, మాస్ ఇమేజ్‌తో తెలుగు కమర్షియల్ సినిమాకు కొత్త నిర్వచనం ఇచ్చారు మెగాస్టార్. ఈ రోజు 71వ ఏట అడుగుపెడుతున్నా అదే ఎనర్జీతో వరుస భారీ సినిమాలు చేస్తూ కొత్త తరం హీరోలకు కూడా స్ఫూర్తిగా నిలుస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి.
పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో 1955 ఆగస్టు 22న కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు జన్మించిన శివశంకర వరప్రసాద్‌కు చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి ఉండేది. ఆ కలను నిజం చేసుకోవడానికి మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరి నటనలో శిక్షణ పొందారు. ‘ప్రాణం ఖరీదు’తో తెరపై కనిపించిన ఆయన, మొదట విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాలు చేస్తూ తన ప్రతిభను నిరూపించుకున్నారు. కానీ 1983లో వచ్చిన ‘ఖైదీ’ ఆయన జీవితాన్నే మార్చేసింది. ఆ సినిమా కేవలం ఒక బ్లాక్‌బస్టర్ మాత్రమే కాదు.. తెలుగు సినిమా కమర్షియల్ దిశను మార్చిన మైలురాయి కూడా.
Also Read
- Hyper Adhi: ‘అక్కడ ఆ ఇంద్రుడిది.. ఇక్కడ ఈ ఇంద్రసేనుడిది’..!
- Jailer 2 First Single: రజనీకాంత్ 'జైలర్ 2' ఫస్ట్ సింగిల్ అవుట్.. ‘అలా బొలేలో’తో అనిరుధ్ మ్యాజిక్.. పాటలో పూర్ణే హైలైట్!
- Brahmastra 2: ‘రామాయణం’ తర్వాత రణబీర్ నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?.. ద్విపాత్రాభినయంతో సిద్ధమవుతున్నాడా?
- Tollywood Comeback: స్టార్ హీరోల ‘సాలిడ్ కంబ్యాక్’: రికార్డుల మోత మోగిస్తున్న 2026 టాలీవుడ్!
‘ఛాలెంజ్’, ‘పసివాడి ప్రాణం’, ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’, ‘గ్యాంగ్ లీడర్’, ‘ఘరానా మొగుడు’, ‘ఇంద్ర’, ‘ఠాగూర్’ వంటి చిత్రాలు ఆయనను తిరుగులేని మెగాస్టార్‌గా నిలబెట్టాయి. ముఖ్యంగా ‘ఘరానా మొగుడు’తో అప్పటి బాలీవుడ్ స్టార్ల స్థాయిలో పారితోషికం అందుకున్న తొలి భారతీయ నటుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. తర్వాత రాజకీయాల్లోకి వెళ్లి కొంతకాలం సినిమాలకు దూరమైనా, ‘ఖైదీ నెం.150’తో తిరిగి వచ్చి భారీ బ్లాక్‌బస్టర్ సాధించి నిజమైన స్టార్డమ్ కాలంతో తగ్గదని నిరూపించారు.
నటనతో పాటు తెలుగు సినిమా డాన్స్ రంగంలో కూడా చిరంజీవి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. మైఖేల్ జాక్సన్ ప్రభావాన్ని తనదైన శైలిలో మిళితం చేస్తూ బ్రేక్ డ్యాన్స్‌ను తెలుగు తెరకు పరిచయం చేశారు. అందుకే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఆయనను ‘మోస్ట్ ప్రొలిఫిక్ యాక్టర్-డాన్సర్’గా గుర్తించింది. 2024లో భారత ప్రభుత్వం ఆయనను పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించడం ఆయన కృషికి మరో గొప్ప గుర్తింపు.
తెరపై హీరోగా మాత్రమే కాకుండా నిజ జీవితంలోనూ ఆయన వేలాది మందికి అండగా నిలిచారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసిన బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా లక్షలాది మందికి సేవలు అందుతున్నాయి. కరోనా సమయంలో సినీ కార్మికుల కోసం సీసీసీ ఏర్పాటు చేసి పరిశ్రమకు పెద్ద దిక్కుగా నిలిచారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పలువురు కళాకారులకు సాయం చేసిన సందర్భాలు కూడా అనేకం. ఆయన ప్రభావం ఈ తరం హీరోలపై ఎంతగా ఉందో విజయ్ దేవరకొండ, విశ్వక్ సేన్ వంటి నటుల మాటల్లోనే తెలుస్తుంది. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన యువకుడూ కలలు కని స్టార్ కావచ్చనే నమ్మకాన్ని చిరంజీవి ప్రయాణం లక్షల మందికి ఇచ్చింది. అదే ఆయన నిజమైన వారసత్వం.
ప్రస్తుతం కూడా మెగాస్టార్ జోరు ఏమాత్రం తగ్గలేదు. ఈ ఏడాది అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’తో మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ అందించిన ఆయన, ఇప్పుడు వశిష్ట దర్శకత్వంలో భారీ సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’, బాబీ కొల్లి దర్శకత్వంలో ‘మెగా 158’ వంటి క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా ఆయన క్లాసిక్ హిట్ ‘ముఠా మేస్త్రి’ 4K వెర్షన్ రీ రిలీజ్ కావడం అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది. 71 ఏళ్ల వయసులోనూ చిరంజీవి స్టార్డమ్కు కొత్త ప్రమాణాన్ని సృష్టిస్తున్నారు. అందుకే మెగాస్టార్ అనే బిరుదు ఒక పేరు కాదు.. తెలుగు సినిమా చరిత్రలో ఒక శకం. ఆయన మరిన్ని సినిమాలు, సేవా కార్యక్రమాలు చేయాలని అభిమానులతో పాటు, పలువురు ప్రముఖులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక అభిమానులు అయితే ఒక పండుగలా జరుపుకుంటున్నారు ఈ ప్రత్యేక రోజుని.
- Tags
- Chiranjeevi
- cinema
తాజావార్తలు
-
Vande Mataram Row: 150 ఏళ్ల చరిత్ర…వందేమాతరంపై కాంగ్రెస్ అభ్యంతరమేంటి?
-
Hyper Adhi: ‘అక్కడ ఆ ఇంద్రుడిది.. ఇక్కడ ఈ ఇంద్రసేనుడిది’..!
-
Chiranjeevi Birthday: శివశంకర వరప్రసాద్ నుంచి మెగాస్టార్ వరకు.. 71 ఏళ్లలోనూ చెక్కుచెదరని చిరు ప్రభంజనం
-
Electric Shock Gloves: అమెరికా దుర్మార్గం..వలసదారులపై కరెంట్ ‘షాక్’ అస్త్రం!
-
Psychology Facts: పొసెసివ్‌నెస్.. రిలేషన్‌షిప్‌ను నాశనం చేస్తుందా?
ట్రెండింగ్
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?