NTV Telugu Site icon

Chiranjeevi: సూపర్ స్టార్ హిట్ కొట్టేశాడు.. నెక్స్ట్ నువ్వే బాసూ

Chiru

Chiru

Chiranjeevi: సూపర్ స్టార్ వర్సెస్ మెగాస్టార్.. ఇలాంటి రోజు అంతకు ముందు వచ్చిందో లేదో తెలియదు కానీ.. ఇప్పుడు మాత్రం వచ్చింది. సూపర్ స్టార్ రజినీకాంత్- మెగాస్టార్ చిరంజీవి మధ్య పోటీ మొదలయ్యింది. రజినీ నటించిన జైలర్ నేడు భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ ను అందుకుంది. తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా రజినీ తన సత్తా చాటాడు. ముఖ్యంగా ఎలివేషన్ సీన్స్ కు, పవన్ కళ్యాణ్ రిఫరెన్స్, కొన్ని రాజాకీయ కోణాలను కూడా చూపించారు. బీస్ట్ సినిమాతో పరాజయాన్ని అందుకున్న నెల్సన్.. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో జైలర్ తీసినట్లు కనిపిస్తోంది. 72 ఏళ్ళ వయస్సులో కూడా రజినీ స్టైల్, స్వాగ్ ఈ మాత్రం తగ్గలేదు అంటే అతిశయోక్తి కాదు. ఇక దాదాపు 25 ఏళ్ళ తరువాత రజినీ- రమ్యకృష్ణ కాంబో బాగా వర్క్ అవుట్ అయ్యింది. మొత్తానికి మూడేళ్ళ తరువాత రజినీ భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఇక ఎట్టకేలకు ఈరోజు రజినీ పాజిటివ్ టాక్ తెచ్చుకొని సేవ్ అయ్యాడు. ఇక ప్రస్తుతం అందరి చూపు చిరంజీవి భోళా శంకర్ మీదనే ఉంది.

Gandeevadhari Arjuna Trailer: భూమికి పట్టిన అతిపెద్ద క్యాన్సర్.. మనిషి

చిరంజీవి, తమన్నా జంటగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భోళా శంకర్. కీర్తి సురేష్ చెల్లెలిగా నటించిన ఈ చిత్రంలో సుశాంత్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. తమిళ్ హిట్ సినిమా వేదాళం కు రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కించాడు మెహర్. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర, సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. రీమేక్ అయినా కూడా సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. చిరు – తమన్నా కాంబో కావడం.. పవన్ కళ్యాణ్ సీన్స్ ను చిరు రీ క్రియేట్ చేయడం.. ముఖ్యంగా చిరు కామెడీ టైమింగ్ హైలైట్ అని చెప్పుకొస్తున్నారు. మరి సూపర్ స్టార్ ఇప్పటికే హిట్ టాక్ ను అందుకున్నాడు.. రేపు చిరు ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటాడో చూడాలి.