Site icon NTV Telugu

Mega154 : యాక్షన్ లోకి దిగిన మెగాస్టార్

Mega 154

Mega154 కోసం మెగాస్టార్ యాక్షన్ లోకి దిగారు. మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ (కేఎస్ రవీంద్ర) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘మెగా154’ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. తాజాగా చిరంజీవి, ఫైటర్స్‌పై ఉత్కంఠభరితమైన యాక్షన్ ఎపిసోడ్‌తో బృందం కొత్త షూటింగ్ షెడ్యూల్‌ను ప్రారంభించినట్లు సమాచారం. యాక్షన్ బ్లాక్‌ని రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ పర్యవేక్షించగా, హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన భారీ సెట్‌లో మేకర్స్ హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరిస్తున్నారు. చిరంజీవి సరసన కథానాయికగా నటిస్తోన్న శృతి హాసన్ త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుందని సమాచారం.

Read Also : PVR-INOX Merger: సినీపోలీస్‌కు ట్విస్ట్.. పీవీఆర్‌-ఐనాక్స్ విలీనం

ఇక తాత్కాలికంగా ‘మెగా154’ అనే టైటిల్ తో పిలుచుకుంటున్న ఈ చిత్రం అన్ని కమర్షియల్ హంగులతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ, శృతిహాసన్‌ కాంబోలో తెరకెక్కుతున్న మొదటి చిత్రం. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, జికె మోహన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ‘మెగా154’కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాకు ఆర్థర్ ఎ విల్సన్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, నిరంజన్ దేవరమానే ఎడిటర్ గా, సుస్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు.

Exit mobile version