NTV Telugu Site icon

Chiranjeevi: స్నేహితుడు కొడుకు పెళ్లిలో సందడి చేసిన చిరు- వెంకీ.. ఫోటోలు వైరల్

Venky

Venky

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కలిసి ఒక పెళ్ళిలో సందడి చేశారు. వీరిద్దరి మ్యూచువల్ ఫ్రెండ్ అయిన కోనేరు కుమార్ కుమారుడు కిరణ్ కోనేరు పెళ్ళిలో ఈ ఇద్దరు స్టార్స్ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. చిరు, భార్య సురేఖతో పెళ్ళికి రాగా.. వెంకీ మామ కూతురుతో కలిసి వచ్చాడు. ఇక వీరిద్దరూ కలిసి పెళ్ళిలో హంగామా సృష్టించారు. తమ స్నేహితులతో కలిసి కొద్దిసేపు చిన్నపిల్లలుగా మారిపోయారు. అనంతరం కొత్తజంటను ఆశీర్వదించి.. వారితో ఫోటోలు దిగారు. ఇక కేవలం వీరే కాకుండా ఈ పెళ్లికి అల్లు అరవింద్, మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలో ఒకరైన నవీన్, టీజీ విశ్వప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఫోటోలను చిరు షేర్ చేస్తూ.. “మా ప్రియమైన మిత్రుడు కుమార్ కోనేరు కుమారుడు కిరణ్ కోనేరు మరియు శైల్య శ్రీల వివాహ వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉంది. కొత్త జంటను ఆశీర్వదించడం ఆనందంగా ఉంది. ఈ సంతోషంలో వెంకీమామ కూడా చేరడం మా సంతోషాన్ని మరింత రెట్టింపు చేసింది” అంటూ రాసుకొచ్చారు.

ఇకపోతే చిరంజీవి సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన విశ్వంభర సినిమా చేస్తున్నారు. వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలోనే విడుదలకు సిద్దమవుతుంది. ఇక వెంకటేష్.. ఈ మధ్యనే సైంధవ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెంకటేష్.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఓకే అన్నట్లు సమాచారం. మరి అది ఎఫ్ 4 అవునో కాదో తెలియాల్సి ఉంది.