NTV Telugu Site icon

Chiranjeevi: చిన్నవాడు అయినా మోక్షజ్ఞ కరెక్ట్ చెప్పాడు.. చిరుకు నువ్వెప్పుడు చెప్తావ్ చరణ్

Bala

Bala

Chiranjeevi: జనరేషన్ మారేకొద్దీ సినిమా ప్రేక్షకుల్లో మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు మా హీరో ఏది చేసినా కరెక్ట్ అనే అభిమానులు.. ఇప్పుడు తమ హీరో ఏదైనా తప్పు చేస్తే.. నిర్మొహమాటంగా నిలదీస్తున్నారు. తప్పు అంటే.. కథల విషయంలో, డైరెక్టర్స్ ను, హీరోయిన్స్ ను ఎంచుకొనే విషయంలో అని అర్ధం అన్నమాట. హీరోల వయస్సుతో కథలకు పనిలేదు.. కానీ, హీరోయిన్ల వయస్సుతో హీరోలకు పని ఉంది. 50 ప్లస్ ఉన్న హీరోల సరసన కనీసం 25 ఏళ్ళు కూడా నిండని హీరోయిన్లు నటించడం, రొమాన్స్చేయడం లాంటివి ఎబ్బెట్టుగా ఉంటున్నాయని ఇప్పటితరం మాట. అంటే .. అప్పట్లో వేటగాడు సినిమాలో శ్రీదేవి.. ఎన్టీఆర్ సరసన నటించలేదా.. ? వారిద్దరి మధ్య గ్యాప్ ఎంత.. ? అనే డౌట్ అందరికి రావచ్చు. అందుకే అంటున్నాం.. జనరేషన్ మారుతుంది అని.. ఇక ఎన్టీఆర్, శ్రీదేవి పెయిర్ గురించి.. కథానాయకుడు సినిమాలో చెప్పుకొచ్చారు. నందమూరి కుటుంబంలో ఆ పెయిర్ ను ఎవరు ఇష్టపడలేదని, అంత చిన్నవయసు అమ్మాయితో చిందులు ఏంటి అని ఎన్టీఆర్ ను కూతుళ్లు, కొడుకులు నిలదీశారట.

Biggboss 7: హౌస్ లో కంటెస్టెంట్ కు గుండెపోటు.. రాత్రికి రాత్రి బయటికి

ఇక ఇప్పుడు బాలయ్య విషయంలో మరోసారి అది జరిగిందని ఆయనే స్వయంగా చెప్పుకొచ్చాడు. భగవంత్ కేసరి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో శ్రీలీలతో నటించాలని ఉందని, ఆమెతో జోడీ కట్టాలని ఉందని ఇంట్లో చెప్తే.. కొడుకు మోక్షజ్ఞ తిట్టాడని, గ్రౌండ్ బలిసిందా నాన్న అని ఘాటుగా రియాక్ట్ అయ్యాడని చెప్పుకొచ్చాడు. ఇక ఈ వీడియో చూసిన తరువాత నెటిజన్లు మొత్తం చరణ్ గురించే మాట్లాడుతున్నారు. చిన్నవాడు అయినా మోక్షజ్ఞ కరెక్ట్ చెప్పాడు చిరంజీవికి నువ్వెప్పుడు చెప్తున్నావ్ అన్నా అంటూ అడుగుతున్నారు. అందుకు కారణం చిరు.. రీ ఎంట్రీ ఇచ్చిన దగ్గరనుంచి ఆయన సరసన నటిస్తున్న హీరోయిన్స్ అందరూ కుర్ర హీరోయిన్లే. కాజల్, తమన్నా, త్రిష, శృతి హాసన్.. అన్నింటికీ మించి మెగా 157 లో చిరు సరసన మృణాల్ ఠాకూర్ అని వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాలో హీరో హీరోయిన్ అన్నాకా ఈడుజోడు ఉండాలి.. కేవలం చిరంజీవి అనే కాదు.. చాలామంది పెద్ద హీరోలు ఇలానే తమకన్నా వయస్సు తక్కువున్న హీరోయిన్లతో ఆడిపాడుతుంటే చూడడానికి ఎబెట్టుగా ఉంటుందని చెప్పుకొస్తున్నారు. 68 ఏళ్ళ వయస్సులో ఇలా కుర్ర హీరోయిన్లతో రొమాన్స్ చేయడం బాలేదని చెప్పుకొస్తున్నారు. కథ విన్నప్పుడు, హీరోయిన్ సెలక్ట్ చేసినప్పుడు చరణ్ అన్నా నువ్వైనా చెప్పు అని కామెంట్స్ పెడుతున్నారు.

Show comments