Site icon NTV Telugu

HBD Allu Arjun : వెల్లువలా పుట్టినరోజు శుభాకాంక్షలు… చిరు స్పెషల్ విషెస్

Allu Arjun

Allu Arjun

“పుష్ప” సక్సెస్ తో పాన్ ఇండియా స్టార్ గా స్టార్ డమ్ ని సొంతం చేసుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ కు సోషల్ మీడియాలో బర్త్ డే శుభాకాంక్షలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. “పుష్ప” ముందు వరకూ టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా మంచి ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకున్న స్టైలిష్ స్టార్ కు “పుష్ప”తో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఫాలోయింగ్ భారీగా పెరిగిపోయింది. దీంతో ఈసారి అల్లు అర్జున్ కు బర్త్ డే మరింత స్పెషల్ గా మారింది. ప్రస్తుతం ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి సెర్బియాలో పుట్టినరోజు వేడుకలను సెలెబ్రేట్ చేసుకుంటున్నారు.

Read Also : Agent : అక్కినేని ఫ్యాన్స్ కు నిర్మాత సారీ !!

ఇక బర్త్ డే సందర్భంగా అల్లు అర్జున్ కు పలువురు సెలెబ్రిటీలతో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా స్పెషల్ గా విష్ చేశారు. “హ్యాపీ బర్త్‌డే బన్నీ. పని పట్ల నువ్వు చూపించే పట్టుదల, కష్టపడేతత్వమే నీకు విజయాలు వరించేలా చేస్తోంది. ఈ ల్యాండ్‌మార్క్‌ పుట్టినరోజుని ఎప్పటికీ గుర్తుండిపోయేలా జరుపుకో” అంటూ చిరు ట్వీట్ చేశారు. ఇక అల్లు అర్జున్ ను సెలెబ్రిటీలు ఎవరెవరు ఎలా విష్ చేశారో చూద్దాం.

https://twitter.com/ganeshbandla/status/1512304484059209731

 

Exit mobile version