Chiranjeevi : టాలీవుడ్ లో సంక్రాంతి చాలా పెద్ద సీజన్. అప్పుడు వచ్చిన సినిమాలు యావరేజ్ టాక్ తెచ్చుకున్నా సరే కలెక్షన్లు మామూలుగా ఉండవు. అందుకే పెద్ద సినిమాలు అన్నీ సంక్రాంతికే రావాలని పోటీ పడుతుంటాయి. మొన్న సంక్రాంతికి వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ ఏ స్థాయిలో కలెక్షన్లు సాధించిందో చూశాం. అనిల్ రావిపూడి ఎక్కువగా సంక్రాంతికే తన సినిమాలను రిలీజ్ చేస్తుంటాడు. వచ్చే సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవితో అనిల్ రావిపూడి చేసే సినిమాను రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. అయితే 2026 సంక్రాంతికే ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాను రిలీజ్ చేస్తామని పూజా సమయంలోనే ప్రకటించారు.
Read Also : Preity Zinta : అభిమానులకు క్షమాపణలు చెప్పిన స్టార్ హీరోయిన్..
అయితే అనుకోని కారణాలతో ఈ మూవీని జూన్ 25న రిలీజ్ చేస్తామని తాజాగా ప్రకటించారు. దీంతో చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమాలకు లైన్ క్లియర్ అయిపోయింది. మొన్నటి వరకు చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ మధ్య సంక్రాంతి వార్ తప్పదని అంతా అనుకున్నారు. కానీ ఎన్టీఆర్ తప్పుకోవడంతో చిరంజీవికి ఎదురే లేకుండా పోయింది. ఎందుకంటే సంక్రాంతికి ఏ స్టార్ హీరోల సినిమాలు లేవు. ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేశ్ బాబు, నాని లాంటి వారు రావట్లేదు. వారి సినిమాలు వేరే డేట్లకు ఆల్రెడీ ఫిక్స్ అయ్యాయి. నితిన్ ఎల్లమ్మ, నవీన్ పోలిశెట్టి మూవీలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ అవేవీ చిరు సినిమాకు పోటీ కావు. ఎందుకంటే చిరు, అనిల్ రావిపూడి సినిమాపై భారీ హైప్ ఉంది. కాబట్టి ఈ మూవీ కొంచెం టాక్ తెచ్చుకున్న భారీ వసూళ్లు ఖాయం.
Read Also : NTR Neel: ఏంటీ తాటాకు చప్పుళ్లు?
