Site icon NTV Telugu

Chinna Jeeyar Swamy: ప్రభాస్ లోకానికి మహోపకారం చేశాడు..

Swami

Swami

Chinna Jeeyar Swamy: ప్రభాస్ లోకానికి మహోపకారం చేశాడని, ఇలాంటి మంచి మనిషికి మరిన్ని మంచి జరగాలని కోరుకున్నారు చిన్న జీయర్ స్వామి. నేడు తిరుపతిలో జరుగుతున్న ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిన్న జీయర్ స్వామి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆదిపురుష్ టీమ్ ఆయనను సాదరంగా ఆహ్వానించింది. అనంతరం చిన్న జీయర్ స్వామి.. ఆదిపురుష్ టీమ్ ను శాలువాతో సత్కరించి ఆశీస్సులు అందించారు. ఆ తర్వాత ఆయన ప్రవచనాలు వినిపించి.. రామాయణం గురించి, రాముడి గొప్పతనం గురించి చెప్పుకొచ్చారు. ఇక రాముడును దేవుడుగా ఉండమని దేవతలు అందరు వచ్చి అడిగినా ఆయన మానవుడిగానే ఉంటానని చెప్పినట్లు తెలిపారు. మంచికి, ఒక మాటకు కట్టుబడి ఉండే మనిషికి రాముడు నిదర్శనమని తెలిపారు. రాముడుని మనుసులు మాత్రమే కాదు.. ప్రకృతి, జంతువులు కూడా ప్రేమించేవని కొన్ని ఉదాహరణలు చెప్పారు.

Adipurush Final Trailer: పాపం ఎంత బలమైనది అయినా అంతిమ విజయం సత్యానిదే

ఇక ఆదిపురుష్ టీమ్ గురించి ఆయన మాట్లాడుతూ.. అరణ్యకాండ, యుద్ధకాండల్లో ఉన్న ప్రధానమైన కథను చరిత్రగా లోకానికి అందించాలి అనే ఆశతో చేస్తున్నాం అని చెప్పారు. ఇంతకంటే లోకానికి మహోపకారం ఇంకొకటి ఉండదు. ఆ ఉపకారం చేస్తున్నాడు ప్రభాస్. అలాంటి ఉపకారం చేస్తున్న ప్రభాస్ కు, చిత్ర బృందానికి శ్రీవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి.. ఇలాగే మంచి పనులు చేయాలి అని కోరుకుంటున్నాను అని తెలిపారు. రాముడి గురించి చాలా సినిమాలు వచ్చాయి. కానీ, ఆ తరం దాటింది. ఇప్పటి తరానికి రాముడు కావాలి. ఇప్పటి టెక్నాలిజీతో ఆ రాముడును చూపించాలి. మోడ్రన్ యూత్ కు రాముడును ఈ టెక్నాలజీతో చూపించాలి. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను అంటూ తెలిపారు.

Exit mobile version