Site icon NTV Telugu

Chinmayi: చిన్మయి అద్దె గర్భం.. ఇక నోరు మూసుకోండి

Chinmayi

Chinmayi

Chinmayi: చిత్ర పరిశ్రమలో సింగర్ చిన్మయి గురించి తెలియని వారుండరు. ఆడపిల్లకు కష్టం అని తెలిస్తే చాలా ఆదుకోవడానికి, ఆమె తరుపున గొంతు ఎత్తడానికి చిన్మయి ముందు వరుసలో ఉంటుంది. ఇక ఆమె సోషల్ మీడియాను ఫాలో అయ్యేవారందరికి తెలుసు ఈ విషాయం గురించి.. ఇక ఆమె పర్సనల్ జీవితం గురించి కూడా అందరికి విదితమే.. కొన్నేళ్ల క్రిందట నటుడు, దర్శకుడు రాహుల్ ను ప్రేమించి పెళ్లిచేసుకున్నది. ఇక గత కొన్ని నెలల క్రితం ఈ జంట కవలలకు జన్మనిచ్చినట్లు ఓక్ పోస్ట్ ద్వారా తెలుపుతూ అభిమానులకు షాక్ ఇచ్చారు.

ఇక ఈ పోస్ట్ పెట్టిన దగ్గరనుంచి చిన్మయిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె కూడా నయనతార లానే అద్దె గర్భం ద్వారా పిల్లలకు జన్మనిచ్చిందంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఇక ఎట్టకేలకు ఈ వార్తలపై చిన్మయి స్పందించడమే కాదు గట్టి కౌంటర్ ఇచ్చింది. ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు దిగిన సెల్ఫీ పోస్ట్ చేస్తూ.. ” ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు దిగిన మొదటి సెల్ఫీ” అని రాసుకొచ్చింది. ఇక దీంతో అద్దె గర్భం వార్తలకు చెక్ పడినట్లే.. అని నెటిజన్లు తమదైన రీతిలో చెప్పుకొస్తున్నారు. ఇప్పటికైనా ఒప్పుకుంటారా.. చిన్మయి అద్దె గర్భం ద్వారా పిల్లల్ని కనలేదని అని కొందరు అంటుండగా.. ఇక నోరు మూసుకోండి..అని గట్టి కౌంటర్ ఇచ్చింది చిన్మయి అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు.

Exit mobile version