Site icon NTV Telugu

Chinmayi : తప్పుచేసి సమర్ధించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.. మరొకసారి జానీ మాస్టర్‌పై విరుచుకుపడ్డ చిన్మయి

Jhany Matsr Chinmayi

Jhany Matsr Chinmayi

కొంతకాలంగా చిన్మయి సినీ రంగంలో మహిళలపై లైంగిక దాడులు, వేధింపులు చేస్తున్న వారిపై గళం విప్పుతూ వస్తున్నారు. ఎంత పెద్దవారైనా, తనకు పరిచయమైన వారైనా – ఎవరిపైనా వెనుకాడకుండా చిన్మయి మాట్లాడుతున్నారు. అలాంటి వారిని ప్రోత్సహించిన, కాపాడినా ప్రభుత్వాలపై కూడా విమర్శలు గుప్పించారు. ఇందులో భాగంగా గత ఏడాది డాన్స్ మాస్టర్ జానీ పై వచ్చిన ఆరోపణల సమయంలో కూడా చిన్మయి గళం విప్పారు. బాధితురాలికి న్యాయం జరగాలని, జానీ పై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇక తాజాగా మరోసారి జానీ మాస్టర్‌పై మళ్లీ విరుచుకుపడ్డారు చిన్మయి..

Also Read : Kaantha : దుల్కర్ సల్మాన్ ‘కాంత’ పై ఎం.కె.టి కుటుంబం ఫిర్యాదు..

“ఒక పెద్దవాడు మైనర్‌తో సంబంధం పెట్టుకోవడం ఎంత పెద్ద తప్పో అర్థం చేసుకోవాలి” అని ట్వీట్ చేశారు. జానీ మాస్టర్ తన సినీ రంగ ప్రభావం వల్ల బాధితురాలికి న్యాయం దొరకడం కష్టం అవుతుందనే ఆందోళన ఆమె వ్యక్తం చేశారు. “నేను ఈ విషయం మాట్లాడినప్పుడల్లా ఆయన భార్య ఫోన్ చేసి అలా మాట్లాడవద్దని చెబుతుంది. కానీ ఒకవేళ కోర్టు తీర్పు ఆయనకు అనుకూలంగా వస్తే, మళ్లీ అతనిపై అవార్డులు కురుస్తాయని, అందరూ అతన్ని హీరోలా చూస్తారని పొగుడుతారు,” అని చిన్మయి చెప్పింది. మైనర్ అమ్మాయిలను వేధించే వాళ్ళు తప్పించుకోవడం చూసి బాధగా ఉందని, కానీ బాధితురాలు ధైర్యంగా నిలబడి విజయం సాధించాలని కోరుకుంటున్నానని చిన్మయి పేర్కొంది. ప్రస్తుతం ఆమె ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో రాహుల్‌, చిన్మయి జంటను కొందరు టార్గెట్‌ చేస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిన్మయి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఇప్పుడు మరోసారి ఆమె జానీ మాస్టర్‌పై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈ వివాదం ఏ దిశలో దారి తీస్తుందో చూడాలి.

 

Exit mobile version