Site icon NTV Telugu

Peddi : ‘చికిరి చికిరి’ సాంగ్‌.. రామ్ చరణ్ పై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్

Ram Charan’s New Single ‘chikiri Chikiri’

Ram Charan’s New Single ‘chikiri Chikiri’

రామ్ చరణ్ హీరోగా, బుచ్చి బాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న పెద్ది మూవీ ఫస్ట్ సింగిల్ ‘చికిరి చికిరి’ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఆ పాట విడుదలై నాలుగు రోజుల్లోనే నాలుగు కోట్ల వ్యూస్‌ దాటింది. పాటకు సంగీతం అందించిన ఏఆర్. రెహమాన్, సింగర్ మోహిత్ చౌహాన్, లిరిక్స్ బాలాజీ రాయగ. ఈ పాటపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆయన ట్వీట్‌లో ఇలా రాసారు..

Also Read : Meenakshi Chaudhary : నాకు ఏజ్‌తో ప్రాబ్లం లేదు.. ఎవరైనా ఓకే

“డైరెక్షన్, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ – ఏదైనా క్రాఫ్ట్ ఉండేది హీరోని ఎలివేట్ చేయడం కోసం. చికిరి చికిరి లో రామ్ చరణ్ ను చాలా రా, రియల్, ఎక్స్‌ప్లోసివ్ గా చూశాను. అనవసరమైన మెరుపులు, భారీ సెట్స్, వందల మంది డ్యాన్సర్స్ లేకుండా కూడా స్టార్ మెరిపించిన బుచ్చి బాబు సానాకు అభినందనలు. స్టార్ పై నే ఫోకస్ పెట్టాలన్న నియమాన్ని పాటించావు.” ఈ పాటలో రామ్ చరణ్ హుక్ స్టెప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఫ్యాన్స్, రీల్స్, షార్ట్ వీడియోస్ ద్వారా ఈ స్టెప్‌ని కాపీ చేసుకుంటూ ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారు. పెద్ది మూవీ ఫుల్ రిలీజ్ మార్చి 27, 2026 కి థియేటర్లలో రాబోతోంది. రామ్ చరణ్ – జాన్వీ కపూర్ జంటగా ఈ సినిమా అభిమానులకు మరో ఫన్, యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైన్‌మెంట్ అందించనుందని టాక్.

 

Exit mobile version