Site icon NTV Telugu

CM Revanth Reddy : అఖిల్ రిసెప్షన్ కు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి

Revanth

Revanth

CM Revanth Reddy : అక్కినేని అఖిల్, జైనబ్ రౌవ్జీ రిసెప్షన్ వేడుకలు ఆదివారం అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతున్నాయి. ఈ వేడుకలు చాలా గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. అఖిల్, జైనబ్ స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నారు. అఖిల్ బ్రౌన్ కలర్ సూట్ లో, జైనబ్ గోల్డ్ కలర్ లెహంగాలో మెరిశారు. ఈ వేడుకకు సినీ సెలబ్రిటీలతో పాటు తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.

Read Also : Payal Rajput : కత్తిలాంటి అందాలన్నీ చూపించిన పాయల్ రాజ్ పుత్..

ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తెలంగాణ మంత్రులు కూడా వచ్చినట్టు తెలుస్తోంది. వారి ఫొటోలు ఇంకా రిలీజ్ కాలేదు. అటు మహేశ్ బాబు, సూర్య వేడుకకు హాజరయ్యారు. టాలీవుడ్ సెలబ్రిటీలు, హీరోలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అఖిల్, జైనబ్ రెండేళ్లుగా డేటింగ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. జైనబ్ ఫ్యామిలీ నాగార్జున కుటుంబానికి ఎప్పటి నుంచో సన్నిహితులే. ఇరు కుటుంబాలు వ్యాపార భాగస్వాములు అని తెలుస్తోంది. ఆ సన్నిహిత్యమే అఖిల్, జైనబ్ లవ్ కు దారి తీసినట్టు సమాచారం. శనివారం వీరిద్దరి పెళ్లి సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఆదివారం రిసెప్షన్ పార్టీ గ్రాండ్ గా జరుగుతోంది.

Read Also : Akkineni Akhil : గ్రాండ్ గా అఖిల్ రిసెప్షన్.. ఎవరెవరు వచ్చారో చూడండి..

Exit mobile version