Chennai Rains Tension to Animal Tamil Version and Naynathara Annapurni Movies: చెన్నై వానలు యానిమల్ మూవీ, నయనతార అన్నపూర్ణిపై పెద్ద ప్రభావాన్ని చూపే ఆవకాశం కనిపిస్తోంది. బుధవారం చెన్నైతో పాటు తమిళనాడులోని ఇతర జిల్లాల్లోని పలు లోతట్టు ప్రాంతాలు భారీ వర్షంతో అతలాకుతలం అయ్యాయి. సోషల్ మీడియా వైరల్ అవుతున్న ఫోటోలను బట్టి చెన్నై, కాంచీపురం మరియు తిరువళ్లూరులోని చాలా వీధులు దాదాపు మోకాళ్ల లోతు నీటితో నిండిపోయాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా చెన్నైలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వర్షం కారణంగా సహాయం అవసరమైన వారి కోసం చెన్నై కార్పొరేషన్ నగరంలో హెల్ప్‌లైన్ నంబర్‌లను సైతం ఏర్పాటు చేసింది. డిసెంబర్ 2 మరియు 3 తేదీల్లో తమిళనాడు రాజధాని – దాని పొరుగు జిల్లాలకు వాతావరణ శాఖ నుండి ఆరెంజ్ అలర్ట్ జారీ చేయబడింది, ఆ అలెర్ట్ ప్రకారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచిస్తుంది.
NTR: మీరు ఓట్లు వేయరా.. రిపోర్టర్స్ కు సెటైర్ వేసిన ఎన్టీఆర్
ఇక ఈ భారీ వర్షాలు తుఫాను కారణంగా రణబీర్ కపూర్ – సందీప్ రెడ్డి వంగా యానిమల్ ఓపెనింగ్స్‌పై పెద్ద ప్రభావం చూపుతుంది. నయనతార ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్ అన్నపూర్ణి కూడా రేపు విడుదలవుతోంది, ఇది కూడా వర్షాల వల్ల ప్రభావితమవుతుంది. ప్రీమియర్ షోల నుండి మంచి రివ్యూస్ అందుకున్న పార్కింగ్ అనే చిన్న చిత్రం కూడా రేపు విడుదల కానుంది. చెన్నై వానలు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉండటంతో ఈ సినిమాలన్నీటి ఓపెనింగ్స్‌పై చాలా ప్రభావం చూపుతాయి. నిజానికి రిలీజ్ సినిమాలకు మొదటి రోజు – మొదటి వీకెండ్ కలెక్షన్స్ చాలా కీలకమైనవి. ఇక చెన్నైతో పాటు తమిళనాడులోని ఇతర జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. చెన్నై, చెంగల్‌పట్టు, రాణిపేట, కాంచీపురం జిల్లాల్లోని పాఠశాలలకు, తిరువళ్లూరులోని పాఠశాలలు, కళాశాలలకు ఈ రోజు సెలవు ప్రకటించారు.దీంతో ఈసారి తమిళనాడు నుంచి యానిమల్ కి పెద్ద దెబ్బ పడినట్టే చెప్పాలి.