Kiran Abbavaram: ఒక్క పాట కోసం కోటి ఖర్చు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా “కలర్ ఫొటో”, “బేబి” వంటి కల్ట్ క్లాసిక్ మూవీస్ ప్రేక్షకులకు అందించిన మేకర్స్ ఎస్ కేఎన్, సాయి రాజేశ్ కాంబినేషన్ లో రూపొందుతున్న “చెన్నై లవ్ స్టోరీ” సినిమాకు బిజినెస్ పరంగా మంచి క్రేజ్ ఏర్పడుతోంది. ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై ఎస్ కేఎన్, సాయి రాజేశ్ నిర్మిస్తున్నారు. సాయి రాజేశ్ కథను అందిస్తున్న ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ తుది దశలో ఉంది. మెలొడీ బ్రహ్మ మణిశర్మ “చెన్నై లవ్ స్టోరీ” సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ రోజు ఈ సినిమా నుంచి గుర్తుందా సాంగ్ లాంఛ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
Also Read:Aishwarya Rajesh: మరో సీనియర్ హీరో సరసన ఐశ్వర్యా రాజేష్?
Also Read
- Nani: ‘నానిని చూస్తుంటే ఆ స్టార్ హీరో గుర్తొచ్చాడు’.. మోహన్ బాబు
- The Paradise: బ్రేక్ అనుకుని యాక్సిలరేటర్ తొక్కేశా.. ఆ క్యారెక్టర్ అని తెలిస్తే ఒప్పుకునేవాడినే కాదు: మోహన్ బాబు
- Mohan Babu: డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల నన్ను దారుణంగా మోసం చేశాడు.. నాని ముందే బాంబ్ పేల్చిన మోహన్ బాబు!
- Ilaiyaraaja : ఇళయరాజాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ – చెన్నై లవ్ స్టోరీ మూవీ డాల్బీలో చేస్తుండటం సంతోషంగా ఉంది. సినిమా కోసం మా టీమ్ అంతా చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు. ఎడిటర్ సంతోష్ ఒక్కో సీన్ కట్ చేసి చూపిస్తూ, మంచి సజెషన్స్ ఇస్తున్నాడు. అలాగే విశ్వాస్ డీవోపీగా నాతో ట్రావెల్ చేస్తూ వస్తున్నాడు. మనవాళ్లు మనతో సినిమా చేస్తున్నప్పుడు ప్రాజెక్ట్ మీద మరింత నమ్మకం కలుగుతుంటుంది. విజయ్ పొలాకీ మాస్టర్ నాతో మంచి కూల్ స్టెప్స్ చేయించాడు. అనంత శ్రీరామ్ గారు అన్ని సాంగ్స్ బ్యూటిఫుల్ గా రాశారు. ఈ మూవీలో హీరోయిన్ ఒక దేవతలా అనిపించాలి. అలాంటి నివి పాత్రలో శ్రీ గౌరి చాలా బాగా పర్ ఫార్మ్ చేసింది. ఆమె నటన ఎంత బాగుందో త్వరలో స్క్రీన్స్ మీద చూస్తారు. రవి నంబూరితో వర్క్ చేయడం సంతోషంగా ఉంది. ఆయన రాసిన డైలాగ్స్ నటుడిగా నన్ను మరింత ఎగ్జైట్ చేశాయి. రచయితగా రవి ఈ చిత్రంతో మరింత మంచి పేరు తెచ్చుకుంటాడు.
దర్శకుడిగా రవితో నాకు మంచి వేవ్ లెంగ్త్ కుదిరింది. ఎస్ కేఎన్ గారికి మూవీ అంటే చాలా ప్యాషన్. ఎప్పుడూ హిట్ సినిమా చేయాలనే మాట్లాడుతుంటారు తప్ప బడ్జెట్ ఎంత ఏంటి అని ఆలోచించరు. ఈ ఒక్క పాట కోసం కోటి రూపాయల ఖర్చు చేసి సెట్ వేశారు. ఆయనకు మూవీ పట్ల ఉన్న ప్యాషన్ హీరోగా నన్ను చాలా ఎగ్జైట్, ఇన్స్ పైర్ చేసింది. నన్ను ఎంతో బాగా చూసుకున్నారు. సాయి రాజేశ్ గారు కథ చెప్పినప్పుడే ఈ సినిమా బలంగా ఉండబోతోంది అని అర్థమైంది. రాజా వారు రాణి గారు తర్వాత నేను ఈ సినిమాలో సెటిల్డ్ గా ఉండే క్యారెక్టర్ చేస్తున్నా. సాయి రాజేశ్ గారు ఉంటే మనం పూర్తి నమ్మకంతో ఉండొచ్చు అని అర్థమైంది. ఈ రోజు మా మూవీ ప్రమోషన్ కంటెంట్ కు వస్తున్న రెస్పాన్స్, సినిమా మీద ఏర్పడిన క్రేజ్, మా మూవీ గురించి అందరూ మాట్లాడుకోవడం సంతోషంగా ఉంది. మణిశర్మ గారు ఏడు పాటలు కంపోజ్ చేశారు. ఏడు పాటల్ని మీరు థియేటర్స్ లో సెలబ్రేట్ చేసుకుంటారు. మా మూవీ రిలీజ్ అయినరోజు థియేటర్స్ లో మ్యూజిక్ కన్సర్ట్ అయినట్లు ఉంటుంది. ఇండియన్ సినిమా గ్రేటెస్ట్ లవ్ స్టోరీస్ లో ఒకటిగా చెన్నై లవ్ స్టోరీ మూవీ మీకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అన్నారు.
తాజావార్తలు
-
Nani: ‘నానిని చూస్తుంటే ఆ స్టార్ హీరో గుర్తొచ్చాడు’.. మోహన్ బాబు
-
KTR : రేవంత్ ఒక నిజాయితీ గల మోసగాడు.. ప్రశ్నిస్తున్నామని ఆయనకు కోపం
-
The Paradise: బ్రేక్ అనుకుని యాక్సిలరేటర్ తొక్కేశా.. ఆ క్యారెక్టర్ అని తెలిస్తే ఒప్పుకునేవాడినే కాదు: మోహన్ బాబు
-
Mohan Babu: డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల నన్ను దారుణంగా మోసం చేశాడు.. నాని ముందే బాంబ్ పేల్చిన మోహన్ బాబు!
-
Flydubai Heroes: పైలట్, ప్లంబర్, డెంటిస్ట్, బిజినెస్ మ్యాన్, బ్యాంకర్.. ఫ్లైదుబాయ్ ఘటనలో హీరోలు వీరే..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?