బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాలీవుడ్ ‘ఛత్రపతి’ షూటింగ్ వైజాగ్ లో జరుగుతోంది. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన ‘ఛత్రపతి’ ఘన విజయం సాధించి ప్రభాస్ కెరీర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇది ప్రభాస్ స్థాయిని పెంచిన సినిమా అని చెప్పవచ్చు. దాదాపు 16 సంవత్సరాల తర్వాత ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. పెన్ స్టూడియో సంస్థ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ సినిమాను ఎప్పుడో ప్రకటించినప్పటికీ కరోనా కారణంగా చిత్రీకరణ ఆలస్యంగా ఆరంభం అయింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వైజాగ్ లో జరుగుతోంది. హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పై పోర్ట్ పరిసరాల్లో కీలక సన్నివేశాలను దర్శకుడు వినాయక్ చిత్రీకరిస్తున్నాడు. ఇందులో బెల్లంకొండ లుక్ ఎలా ఉంటుందనేది రివీల్ చేయలేదు.
వైజాగ్ షూటింగ్ సమయంలో ఏపీ మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు యూనిట్ సభ్యులను కలుసుకున్నారు. వినాయక్ తో మంత్రి కలిసి ఉన్న ఫొటో సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఒరిజినల్ కు ఎలాంటి మార్పు లేకుండా ఈ రీమేక్ ను యాజ్ టీజ్ గా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. బాలీవుడ్ రీమేక్ కోసం విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ లో సలహాలు సూచనలు చేసి ఉత్తరాది ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఛేంజెస్ చేశారట. మరి బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న బెల్లంకొండ వారబ్బాయికి ఎలాంటి ఫలితం దక్కుతుందో చూడాలి.
