ట్రిపుల్ ఆర్ సినిమాకు ముందు టాలీవుడ్‌కి మాత్రమే పరిమతమైన ఎన్టీఆర్, రామ్ చరణ్… ట్రిపుల్ రిలీజ్ తర్వాత పాన్ ఇండియా హీరోలు అయిపోయారు. ఆ తర్వాత ఓటిటిలో ట్రిపుల్ ఆర్ రిలీజ్ అయ్యాక హాలీవుడ్‌ని అట్రాక్ట్ చేశారు. ఇక నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంతో… గ్లోబల్ స్టార్స్‌గా మారిపోయారు. ప్రస్తుతం మెగా, నందమూరి ఫ్యాన్స్ గ్లోబల్ క్రేజ్‌తో రెచ్చిపోతున్నారు. అయితే ఓ దేశంలో మాత్రం ఈ ఇద్దరు పూర్తి స్థాయిలో జెండా పాతేశారు. జపాన్‌లో చరణ్, ఎన్టీఆర్ క్రేజ్ చూస్తే వావ్ అనాల్సిందే. ఇండియాలో 1200 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన ట్రిపుల్ ఆర్… జపాన్‌లో లేటుగా రిలీజ్ అయ్యి భారీ వసూళ్లను రాబడుతోంది. అక్కడ ఈ చిత్రానికి 1 బిలియన్ యెన్.. అంటే దాదాపు 60 కోట్లు వసూళ్లు వచ్చాయి. ఇక తాజాగా రామ్ చరణ్, ఎన్టీఆర్‌లకు అరుదైన గౌరవం లభించింది.
Read Also: Mrunal Thakur: ఎర్ర తివాచీపై తెల్లని దుస్తుల్లో మెరిసిపోతున్న మృణాల్
జపాన్‌లో అత్యంత పాపులర్ మ్యాగజైన్ ‘యాన్ యాన్’ కవర్ పేజీపై ఈ ఇద్దరు ఫోటోలను ప్రచురించారు. ట్రిపుల్ ఆర్ సినిమాలో మనోళ్ల నటనకు జపాన్ ఆడియెన్స్ బ్రహ్మరథం పట్టడమే కాకుండా.. టాప్ జపనీస్ మ్యాగజైన్ కవర్ పేజీపై ఈ స్టార్లు నిలవడం మామూలు విషయం కాదు. దీంతో చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం ఈ కవర్ పేజీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే మరో విశేషం ఏంటంటే.. ట్రిపుల్ ఆర్ సినిమా ఇంకా కొన్ని థియేటర్లలో జపాన్‌లో హౌస్ ఫుల్‌తో రన్ అవుతోంది. ఏదేమైనా ట్రిపుల్ ఆర్ సినిమా ఎప్పటికీ ఓ సంచలనమే.