NTV Telugu Site icon

Ram Charan : హీరో’ బ్రాండ్ అంబాసిడర్‌గా చరణ్!

Ram Charan

Ram Charan

బన్నతో పోలిస్తే ఎన్టీఆర్, రామ్ చరణ్ బ్రాండింగ్ లో బాగా వెనుకబడిపోయారన్న విషయాన్ని ఇటీవల చెప్పటం జరిగింది. అల్లు అర్జున్ స్పెషల్ పిఆర్ టీమ్ టై అప్ తో బ్యాక్-టు-బ్యాక్ బ్రాండింగ్ చేస్తూ ‘పుష్ప’ ద్వారా వచ్చిన క్రేజ్‌ను క్యాష్ చేసుకుంటూ దూసుకు పోతున్నాడు. అంతే కాదు ఏకంగా హాలీవుడ్ ప్రాజెక్ట్ అంటూ ఫీలర్స్ వదులుతున్నాడు.

అది చూసో ఏమో చరణ్ కూడా స్పీడ్ పెంచాడు. తాజాగా బడా బ్రాండ్ ని పట్టేశాడు. మెగా అభిమానులు ఖుషీ అయ్యే వార్త ఏమిటంటే రామ్ చరణ్ హీరో బైక్ కి బ్రాండింగ్ చేస్తున్నాడు. ఈ కమర్షియల్ షూటింగ్ కూడా జరుగుతోంది. ఒకటిన్నర సంవత్సర కాలం త్వరలోనే 30 సెకన్ల టీజర్‌ రిలీజ్ కానుంది. చరణ్ తొలి సినిమా ‘చిరుత’తోనే బ్రాండింగ్ ఆరంభించాడు. అయితే తన బాలీవుడ్ మూవీ ‘జంజీర్’ పరాజయం కొంత మేరకు చరణ్ బ్రాండింగ్ మార్కెట్ ను దెబ్బతీసింది. అయితే ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మళ్లీ ఊపుతో బ్రాండింగ్ మొదలెట్టాడు. మరి చరణ్ ఖాతాలో ఇంకెన్ని బ్రాండ్స్ వచ్చి చేరతాయో చూడాలి.