నార్త్ ప్రేక్షకులు మార్పు కోరుకుంటున్నారు. హారర్, నేషనల్ ఇష్యూస్, యాక్షన్ చిత్రాల చూసి చూసి బోర్ కొట్టేసిన మూవీ లవర్స్.. లవ్ అండ్ రొమాంటిక్ చిత్రాల కోసం వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ ఓ సింపుల్ ప్రేమ కథలు చూడాలనుకుంటున్నారు. అందుకోసం జులై నుండి ఇక బీటౌన్ థియేటర్లు లవర్స్‌తో కిటకిటలాడబోతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు లవ్ స్టోరీలను ప్రేక్షకుల ముందుకు తెచ్చేస్తోంది బాలీవుడ్.
మొన్నటి వరకు దేశభక్తి, యాక్షన్ హీరోగా మారిన సిద్దార్థ్ మల్హోత్రా మళ్లీ లవర్ బాయ్ అవతారం ఎత్తబోతున్నాడు. ‘పరమ్ సుందరి’తో కలిసి డ్యూయెట్ పాడబోతున్నాడు. ఫ్యామిలీ అండ్ యూత్ ఫుల్ ప్రేమ కథలను వడ్డించడంలో పేరుగాంచిన యష్ రాజ్ ఫిల్మ్స్ ఇప్పుడు న్యూ యాక్టర్స్‌తో ‘సైయారా’ చిత్రాన్ని సిద్దం చేస్తోంది. ఒకప్పటి డ్రీమ్ బాయ్ మాధవన్ కూడా ‘ఆప్ జైసా కోయి’ అంటూ మెచ్యూర్డ్ ప్రేమ కథను ఓటీటీలో పట్టుకొస్తున్నాడు. అలాగే ‘ఆఖోంకీ గుస్తాఖియా’ అంటూ రాబోతున్నారు విక్రాంత్ మాస్సే అండ్ శనాయ కపూర్. అనురాగ్ బసు మ్యూజికల్ లవ్ స్టోరీలో కార్తీక్ ఆర్యన్‌తో జోడీ కడుతోంది శ్రీలీల. అనన్య పాండేతో కలిసి ‘తు మేరీ మే తేరా’లో డ్యూయెట్ పాడబోతున్నాడు. కిల్‌తో మోస్ట్ వయెలెంట్ హీరోగా మారిన లక్ష్య చాంద్ మేరా దిల్ అంటున్నాడు. వరుణ్ ధావన్ ఒకేసారి ఇద్దరు ముద్దుగుమ్మలు పూజాహెగ్డే, మృణాల్‌తో ట్రయాంగిల్ లవ్ స్టోరీ ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ రెడీ చేస్తున్నాడు. ఇలా హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, భావోద్వేగాలతో ఫీల్ గుడ్ చిత్రాలను రెడీ చేస్తోంది బాలీవుడ్. మరి రూటు మార్చిన బాలీవుడ్ కు కాసుల వర్షం కురుస్తోందో లేదో.
