Ramayana : రామాయణ ఇంగ్లీష్ వర్షన్‌లో మార్పులు.. పాటలు, కొన్ని సీన్స్‌కు కటింగ్ వేస్తోన్న టీం

Ramayana Part 1

Ramayana Part 1

ఇండియా మొత్తం ఎదురు చూస్తున్న మోస్ట్ యాంటిసిపెటెడ్ ఫిల్మ్ రామాయణ పార్ట్ వన్ దీపావళికి రాబోతుంది. ఇండియాలో మూడు గంటలకు పైగా రన్ టైంతో రిలీజ్ కాబోతుందని టాక్. కానీ ఇంగ్లీష్ వర్షన్ మాత్రం 30 నిమిషాల లెస్ నిడివితో విడుదల కాబోతుందట. అక్కడ సాంగ్స్, కొన్నిసీన్స్ కట్ చేసి రిలీజ్ చేస్తున్నారన్నది బాలీవుడ్ టాక్. రాముడిగా రణబీర్, సీతగా సాయి పల్లవి, యశ్ రావణాసురుడిగా నటిస్తున్నారు. రామాయణ ఈ ఈ ముగ్గురికీ టెస్టింగ్ టైం. యానిమల్ లాంటి వయెలెంట్ ఫిల్మ్ తర్వాత రణబీర్ నుండి వస్తున్న ఫిల్మ్ ఇదే.

రాముడిగా రణబీర్ కపూర్ ఎలా చేస్తాడోనన్న క్యూరియాసీటి నెలకొంది. ఇక ఫస్ట్ ఫిల్మ్ ఏక్ దిన్‌తో హిందీ ఆడియన్స్‌ను ఆకట్టుకోలేకపోయింది సాయి పల్లవి. ఇప్పుడు సీతగా బాలీవుడ్ మాత్రమే కాదు సౌత్ ఆడియన్స్‌ను మెప్పించగలగాలి న్యాచురల్ బ్యూటీ. టాక్సిక్ భారీ ఫెయిల్యూర్ తర్వాత యశ్ ఈ మూవీపై నటుడిగా, నిర్మాతగా హోప్ పెట్టుకున్నాడు. విజువల్ వండర్‌గా తెరకెక్కించిన రామాయణలో ఎప్పటికప్పుడు మిస్టేక్ సరిదిద్దుకుంటోంది మూవీ టీం. టీజర్‌పై వచ్చిన విమర్శల నేపథ్యంలో ఈ ట్రైలర్‌లో విజువల్ ఎఫెక్ట్స్, లైటింగ్, కలర్ గ్రేడింగ్‌లను మెరుగుపరిచింది. తాజాగా వదిలిన జై జై రామ్ సాంగ్‌లోనూ విజువల్ ఇంఫ్రూవైజ్ చేసినట్లు కనిపిస్తోంది. 4 వేల కోట్లతో తెరకెక్కిన ఈ మూవీని నితిష్ తివారి తెరకెక్కిస్తుండగా.. నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్నాడు. ఇంతటి భారీ అంచనాలున్న రామాయణ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందోనని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.