Site icon NTV Telugu

Chandrabose – RP: చంద్రబోస్, ఆర్పీలకి కొత్త బిరుదులు.. ఏమంటే?

Chandrabose Rp Patnaik

Chandrabose Rp Patnaik

Chandrabose – RP Patnaik Felicitated: డల్లాస్ లో ఆస్కార్ విన్నింగ్ లిరిసిస్ట్ చంద్రబోస్ , ఆర్.పి.పట్నాయక్ లు ఘన సన్మానం అందుకున్నారు. నార్త్ అమెరికాలోని టెక్సాస్ లోని డల్లాస్ నగరంలో పేరు పొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు డాక్టర్ మీనాక్షి అనుపిండి. ఆమె సుస్వర మ్యూజిక్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షురాలుగా దాదాపు 21 సంవత్సరాల నుంచి ఆమె సుస్వర మ్యూజిక్ అకాడమీ పేరిట ఎంతో ఘనంగా ప్రతి ఏడాది వార్షికోత్సవ సంబరాలను నిర్వహిస్తున్న క్రమంలో ఈ ఏడాది మే 5వ‌ తేదీ ఆదివారం డల్లాస్ నగరంలో గ్రాండ్ సెంటర్ అనే ఆడిటోరియంలో సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవ సంబరాలను గ్రాండ్ గా నిర్వ‌హించారు. ఈ ఉత్సవానికి డల్లాస్ నగర తెలుగు ప్రముఖులు, పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు అతిధులుగా హాజర‌య్యారు.

Sai Pallavi : కోట్లు ఇచ్చిన ఆ పని చెయ్యనని చెప్పేసిన సాయి పల్లవి..

ప్రముఖ సినీ గేయ రచయిత, ఆస్కార్‌ అవార్డు గ్రహీత చంద్రబోస్ గారు, ప్రముఖ సంగీత దర్శకులు ఆర్. పి. పట్నాయక్, టాలీవుడ్ డైరెక్ట‌ర్ వి. ఎన్‌. ఆదిత్య‌తో సహా పలువురు సినీ ప్రముఖులు పాల్గొని సంద‌డి చేశారు. ఇకఈ వార్షిక సంబరాల్లో మీనాక్షి తన శిష్య బృందంతో 7 సిగ్మెంట్లలో దాదాపు 30కి పైగా సంప్రదాయ సంగీత కీర్తనలను ప్రదర్శన ఇచ్చారు. 10 గంటల పాటు నిర్విరామంగా సాగిన ఈ ప్రదర్శన ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంది. అలాగే సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షిక సంబరాల వేదిక పై, చంద్రబోస్ గారికి “సుస్వర సాహిత్య కళానిధి” అనే బిరుదునిచ్చి సత్కరించారు. మరో ఆసక్తికర విషయం ఏమంటే చంద్ర‌బోస్ త‌న స్వ‌గ్రామం చల్లగరిగెలో తల పెట్టిన ఆస్కార్ గ్రంధాల‌య నిర్మాణానికి, ఈ కార్య‌క్ర‌మం ద్వారా 15 వేల డాల‌ర్స్ కు పైగా విరాళాలు అందాయి. ఈ వార్షిక సంబరాల్లో ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు ఆర్. పి. పట్నాయక్ కు, “సుస్వర నాద‌నిధి” ,అనే బిరుదుతో సత్కారం చేశారు.

Exit mobile version