Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Chandrababu Swearing In Event To Be Managed By Boyapati Srinu

Boyapati: బాబు ప్రమాణస్వీకార బాధ్యతలు బోయపాటి చేతికి.. సినిమా వేడుకలను తలదన్నేలా?

Published Date :June 7, 2024 , 8:26 pm
By Bhargav Chaganti
Boyapati: బాబు ప్రమాణస్వీకార బాధ్యతలు బోయపాటి చేతికి.. సినిమా వేడుకలను తలదన్నేలా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Chandrababu Swearing in Event to be Managed By Boyapati Srinu: అమరావతిలో కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణ స్వీకార వేదిక, ముహూర్తం ఖరారు అయింది. ఈ నెల 12న ఉదయం 11:27కు సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు. విజయవాడ శివారు గన్నవరం ఎయిర్‌పోర్టు సమీపంలోని కేసరపల్లి ఐటీపార్క్ దగ్గర ప్రమాణస్వీకారం జరగనుంది.. ప్రమాణస్వీకారానికి అధికార వర్గాలు ఏర్పాట్లు ముమ్మరం చేశాయి. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోడీ సహా ఎన్డీఏ వర్గానికి చెందిన పలువురు సీఎంలు హాజరు కానున్నారు. ఇక తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ ప్రమాణ స్వీకార వేడుక టాలీవుడ్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఆధ్వర్యంలో జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. ముందు నుంచి బోయపాటి శ్రీను తెలుగుదేశం పార్టీకి మద్దతుదారుడు గానే ఉన్నారు. దానికి తోడు బాలకృష్ణతో వరుస సినిమాలు చేయడంతో నందమూరి- నారా కుటుంబాలతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

Chandrababu Swearing Ceremony: చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. ముహూర్తం, వేదిక ఫిక్స్

ఎన్నికల కౌంటింగ్ రోజు కూడా పూర్తిస్థాయిలో మెజారిటీ వస్తుందని తేలకముందే ఆయన ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లడం కూడా చర్చనీయాంశమైంది. ఇక ఈ నేపథ్యంలో బోయపాటి శ్రీను ఆధ్వర్యంలోనే చంద్రబాబు ప్రమాణ స్వీకార వేడుక జరగబోతోంది. పాన్ ఇండియన్ సినిమాల వేడుకలను తలదన్నే విధంగా బోయపాటి శ్రీను ఈ వేడుకలను ప్లాన్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం ప్రత్యేకమైన సెట్స్ కూడా నిర్మిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. అయితే గతంలో పుష్కరాల సమయంలో బోయపాటి శ్రీను ఏపీ ప్రభుత్వం కోసం చేపట్టిన డాక్యుమెంటరీ వ్యవహారంలో కొన్ని ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో తొక్కిసలాటకు కారణం బోయపాటి శ్రీను షూటింగ్ చేయడమేనని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆ విషయం నిజం కాదని అప్పటి ప్రభుత్వం కొట్ట పారేసింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Boyapati
  • Boyapati Srinu
  • chandrababu

తాజావార్తలు

  • DCvsGT : చివరి బంతి థ్రిల్..! ఒక్క పరుగుతో గెలిచిన గుజరాత్… రాహుల్ హీరోయిజం వృథా!

  • Vigilance Report On Adudam Andhra : రోజా, బైరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు..

  • Strait of Hormuz: హర్మూజ్ రీ ఓపెన్.. ఒక్కో నౌక ఇరాన్‌కు ఎంత చెల్లించాలో తెలుసా..?

  • TG BJP : కమలదళంలో నిధుల సెగ..? తెలంగాణ బీజేపీలో గోల్‌మాల్ గుసగుసలు.!

  • Chandrababu Naidu: రైతులకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు.. వారందరికీ..

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions