Chandrababu Swearing in Event to be Managed By Boyapati Srinu: అమరావతిలో కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణ స్వీకార వేదిక, ముహూర్తం ఖరారు అయింది. ఈ నెల 12న ఉదయం 11:27కు సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు. విజయవాడ శివారు గన్నవరం ఎయిర్‌పోర్టు సమీపంలోని కేసరపల్లి ఐటీపార్క్ దగ్గర ప్రమాణస్వీకారం జరగనుంది.. ప్రమాణస్వీకారానికి అధికార వర్గాలు ఏర్పాట్లు ముమ్మరం చేశాయి. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోడీ సహా ఎన్డీఏ వర్గానికి చెందిన పలువురు సీఎంలు హాజరు కానున్నారు. ఇక తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ ప్రమాణ స్వీకార వేడుక టాలీవుడ్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఆధ్వర్యంలో జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. ముందు నుంచి బోయపాటి శ్రీను తెలుగుదేశం పార్టీకి మద్దతుదారుడు గానే ఉన్నారు. దానికి తోడు బాలకృష్ణతో వరుస సినిమాలు చేయడంతో నందమూరి- నారా కుటుంబాలతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
Chandrababu Swearing Ceremony: చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. ముహూర్తం, వేదిక ఫిక్స్
ఎన్నికల కౌంటింగ్ రోజు కూడా పూర్తిస్థాయిలో మెజారిటీ వస్తుందని తేలకముందే ఆయన ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లడం కూడా చర్చనీయాంశమైంది. ఇక ఈ నేపథ్యంలో బోయపాటి శ్రీను ఆధ్వర్యంలోనే చంద్రబాబు ప్రమాణ స్వీకార వేడుక జరగబోతోంది. పాన్ ఇండియన్ సినిమాల వేడుకలను తలదన్నే విధంగా బోయపాటి శ్రీను ఈ వేడుకలను ప్లాన్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం ప్రత్యేకమైన సెట్స్ కూడా నిర్మిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. అయితే గతంలో పుష్కరాల సమయంలో బోయపాటి శ్రీను ఏపీ ప్రభుత్వం కోసం చేపట్టిన డాక్యుమెంటరీ వ్యవహారంలో కొన్ని ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో తొక్కిసలాటకు కారణం బోయపాటి శ్రీను షూటింగ్ చేయడమేనని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆ విషయం నిజం కాదని అప్పటి ప్రభుత్వం కొట్ట పారేసింది.